పుట్టగానే ఈ బిడ్డ చేసిన పనికి డాక్టర్ లే షాక్

66

సోషల్ మీడియాలో ఒక నవజాత శిశువుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. పిల్లలు పుట్టగానే ఏడవడం మంచిదంటారు. శిశువు ఊపిరితీత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకొనేందుకు పిల్లలను ఏడిపించడం సర్వ సాధారణం. సాధార‌ణంగా అప్పుడే పుట్టిన శిశువు ఏం చేస్తాడు? అంటే ‘ఏడుస్తాడు’ అనే సమాధానం చెబుతాం ఎవరైనా. అయితే, బ్రెజిల్‌లోని రియో డీ జెనెరియోలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్లు తెరిచి చూడటానికి కనీసం రెండు మూడు గంటలైనా పడుతుంది. కానీ జస్ట్ అప్పుడే పుట్టిన ఓ శిశువు డెలీవరీ చేసిన డాక్టర్ వైపు కోపంగా చూసినట్లుగా ఉండే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బ్రెజిల్ కు చెందిన డయాన్ డి, జీసస్ బార్బోసాలు భార్య భర్తలు. బార్బోసా గర్భవతి. ఫిబ్రవరి 22న సీ-సెక్షన్ చేసేందుకు డాక్టర్లు టైం ఇచ్చారు. అయితే బార్బోసాకు పురిటి నొప్పులు రావడంతో ఫిబ్రవరి 13న ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా తమకు పుట్టబోయే బిడ్డను ఫోటోలు తీయాలంటూ ఆ దంపతులు స్థానికంగా ఫోటో గ్రాఫర్ గా ఉన్న రోడ్రిగో కుంస్ట్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సాధారణంగా శిశువు పుట్టిన వెంటనే డాక్టర్లు లంగ్స్ లో కానీ శరీరంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెక్ చేసేందుకు వీపు నిమురుతారు. వీపు నిమిరినప్పుడు శిశువు ఏడిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు కన్ఫాం చేస్తారు. బార్బోసా పుట్టిన శిశువు ఏడవలేదు. కనీసం కళ్లు కూడా తెరవలేదు. అయితే బొడ్డుతాడు కట్ చేస్తే తాను ఫోటోలు తీస్తానని రోడ్రిగో డాక్టర్లను కోరాడు. దీంతో ఫోటోలు తీసేందుకు వీలుగా ఉంటుందని డాక్టర్లు బొడ్డు తాడు కట్ చేశాడు. దీంతో పాప ఏడ్చింది. దీంతో వైద్యులు కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉందని ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఆ పాప ఏడవడానికి ముందు పాప ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను ఫోటోగ్రాఫర్ రోడ్రిగో 10ఫోటోల్ని క్యాప్చర్ చేశాడు. ఆ ఫోటోలలో బిడ్డ డాక్టర్స్ వైపు కోపంగా చూస్తున్నట్టు కనిపించింది. ‘‘నాకు ఇంకా కడుపులోనే ఉండాలని ఉంది. అప్పుడే బయటకు ఎందుకు తీశారు’’ అన్నట్లుగా వారిపై ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా ముఖం పెట్టింది. ప్రసవానికి ముందే బిడ్డకు ఆమె తల్లిదండ్రులు ఇసాబెలా పెరీరా డి జీసస్ అని పేరు పెట్టారు. ఇక ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉందనీ, ఎటువంటి సమస్యలు లేవని, కాసేపటికి ఆ శిశువు సాధారణ శిశుల్లాగానే ఉండటంతో బిడ్డ తల్లిదండ్రులతో పాటు డాక్టర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ నవజాత శిశువు ఫొటోపై నెటిజన్స్ జోకులు పేలుస్తున్నారు. ఈ ఫొటోలతో మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఈ బిడ్డ ఎక్స్‌ప్రెషన్‌కు మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

Content above bottom navigation