మరో సినీ నటుడికి కరోనా..
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా హడలెత్తిస్తోంది. ఈ వైరస్ తాకిడికి జనాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. చిన్న , పెద్ద, పేద , ధనిక అనే తేడాలు లేకుండా అందరికి ఈ కరోనా వైరస్ సోకుతుంది. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటుడు ఇడ్రిస్ ఎల్బా.. తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని చెబుతూ, ఆ లక్షణాలు మాత్రం లేవని తెలిపాడు.

ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులోతాను చికిత్స పొందుతున్నట్టు .. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్త పాటించాలని ఇడ్రిస్ చెప్పుకొచ్చాడు. తనకి ఆదివారం పాజిటివ్ వచ్చిందని .. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉంటున్నట్టు తెలిపిన ఇడ్రిస్ .. తన భార్యను తన నుంచి దూరంగా ఉండమని అందరూ సలహా ఇచ్చారు. ఆమెకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆమెకు ఈ వైరస్ సోకలేదని తెలిపి అభిమానులను ఖంగారు నుండి బయటపడేసాడు.
