హైదరాబాద్‌లో కరోనాకు హోమియో మందు.. క్యూ కడుతున్న జనాలు

113

హైదరాబాద్‌లో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో నగర వాసులు వణికిపోతున్నారు. కోవిడ్ ఎక్కడ తమకు సోకుతుందోననే భయాందోళనలు ప్రజల్లో కనిపిస్తున్నాయి. కరోనా నివారణ మందులు వేసుకోవడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీఐ) ముందు హోమోయోపతి మందు కోసం వందలాది మందు బారులు తీరారు. కరోనా వైరస్ రోగనిరోధక ఔషధం పేరిట తెలంగాణ ఆయుష్ విభాగం ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి హోమియోపతి మందుల్ని పంపిణీ చేసింది.

Image result for corona various

ఆర్సెనిక్ ఆల్బ్ 30 పీ ఔషదం కరోనాను నిరోధిస్తుందనే కేంద్రం సూచన మేరకు తెలంగాణ ఆయుష్ విభాగం వీటిని పంపిణీ చేసింది. రోజుక ఆరు పిల్స్ చొప్పున భోజనానికి అర గంట ముందు, అర గంట తర్వాత వేసుకోవాలని ఆ స్టాల్ దగ్గర రాశారు. ఏడాది లోపు వయసున్న పిల్లలకు తల్లిపాలతోపాటు రోజుకు మూడు బిల్లలు ఇవ్వాలని సూచించారు.మంగళవారం ఒక్కరోజే 3500 మందికి 11,500 డోసుల ఔషధాన్ని పంపిణీ చేశారు. ఈ హోమియోపతి ఔషధాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ తరహా పిల్స్‌ను శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారికి, స్వైన్ ఫ్లూ సోకిన వారికి కూడా ఇచ్చామని వైద్యాధికారులు తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఆర్సెనికా ఆల్బ్ ఔషధం కరోనా వైరస్ కోసం తయారు చేసింది కాదని.. కానీ ఏ రకమైన ఇన్ప్లూయెంజాకైనా ఉపయోగించొచ్చన్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. 200 పీ అనేది స్వైన్ ఫ్లూ కోసమని, 30పీ అనేది కరోనా వైరస్ లక్షణాల కోసమని హోమియోపతి ఫిజిషియన్ ఒకరు తెలిపారు. ఈ మెడిసిన్‌ను నెల రోజులుగా విమానాశ్రయంలోనూ పంపిణీ చేస్తున్నామన్నారు.కరోనా వైరస్‌కు మందులు తయారు చేయలేదని ప్రపంచం ఆరోగ్యం సంస్థ సైతం చెబుతుంటే.. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేకుండా హోమియోపతి మందులు ఇస్తున్నారంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation