14 ఏళ్ల అమ్మాయి మిస్సింగ్ : ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే షాక్

213

ప్రస్తుతం కాలంలో యువతీయువకులు అనాలోచన నిర్ణయాలు తీసుకుని ఎన్నో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మైనర్ వయసులో ఉండే వాళ్ళు ప్రేమ పెళ్లిళ్లు అంటూ, కన్నవాళ్ల పరువును బజారుకు ఈడుస్తున్నారు. చిన్న వయసులో ప్రేమలో పడటం, పెళ్ళికి ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటూ ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. స్కూల్ కని వెళ్లిన అమ్మాయి తన ప్రియుడితో కలిసి పారిపోయి తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలో. రుద్రగుడెం లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో కోడిశెలకుంట కు చెందిన అంజలి అనే 14 సంవత్సరాల అమ్మాయి చదువుకుంటున్నది. పాఠశాలకు వెళతానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. స్కూల్ కు వెళ్లిన ఆ అమ్మాయి అకస్మాత్తుగా ఆశ్రమ పాఠశాల నుంచి మాయం అయింది. ఈ విషయం తెలియగానే ఆశ్రమ పాఠశాల అధికారుల గుండె గుభేలుమంది. కేసు తమ మీదకు వస్తుందని వారు వణికిపోయారు. ఏం జరిగిందో ఏమో తెలియలేదు. కానీ అమ్మాయి మాత్రం మిస్ అయ్యింది. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తేనే మంచిదని భావించి చివరికి ఆ బాలిక తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు.. దాంతో వారు లబోదిబో మంటూ ఆశ్రమ పాఠశాలకు వచ్చారు. తమ కూతురు ఏమైందో చెప్పాలని వారు స్కూల్ యాజమాన్యాన్ని అడిగారు.. ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.

ఏమైందోనని ఆందోళన చెందుతూ నల్లబెల్లి పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. తమ కుమార్తె తప్పిపోయిందని ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులకు కంగారు పుట్టింది. ఆ బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా..లేక ఆ అమ్మాయే ఎక్కడికైనా వెళ్లిందా అనే విషయం తెలుసుకోడానికి విచారణ చేపట్టారు. జరగరానిది ఏదైనా జరిగితే తమకు చెడ్డపేరు వస్తుందని పోలీసులు అన్ని వైపులా నుంచి విచారణ చేస్తున్నారు. ఆ అమ్మాయి కోసం అందరూ కలిసి గాలింపు మొదలు పెట్టారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ను, ఆ స్కూల్ పరిసరాల్లో ఉండేవాళ్ళను, ఆ చుట్టూ పక్కల ఉండే సీసీ కెమెరాలను..అన్నిటిని పరిశీలించారు. కానీ ఆ అమ్మాయికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలియలేదు.

Image result for lovers

ఒక మూడు రోజుల అకస్మాత్తుగా వారి దగ్గరకు ఒక ఫోటో వచ్చి చేరింది. అకస్మాత్తుగా కనిపించకుండా వెళ్లిన బాలిక నిజానికి మిస్ అవ్వలేదు. ఆ అమ్మాయి మరో మైనర్ బాలుడితో కలిసి పారిపోయింది. దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే మైనర్ బాలుడితో ఆ అమ్మాయికి ఎప్పటినుంచో స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. ఇద్దరు పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. ఇద్దరు కలిసున్నా ఫోటోలనే తల్లిదండ్రులకు పంపారు. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి అందరికి చెప్పేసింది. దాంతో ఈ మిస్సింగ్ కేసు కథ కంచికి చేరింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation