ఆమె తిడుతూ డైలాగ్ చెబితే నవ్వుల పువ్వులు పూయాల్సిందే… అనర్గళంగా మాట్లాడుతూ, నటిస్తోంటే ఎంతటి వారైన ముగ్ధులవ్వాల్సిందే. ఆమే 58 ఏళ్ల మై విలేజ్ షో గంగవ్వ. సహజ నటనతో యూట్యూబ్ ప్రేక్షకుల మనసులు దోచేస్తున్న ప్రతిభావని.
ఇది కూడా చదవండి: ఢీ కంటెస్టెంట్ ను పెళ్లి చేసుకోబోతున్న శ్రీముఖి.. ఎవరో తెలుసా?
గంగవ్వ ఊరు జగిత్యాల జిల్లా లంబాడిపల్లి ఆమెకు పదేళ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రి చనిపోయారు. ఇద్దరు తమ్ముళ్లు. మేనత్త గంగవ్వను పెంచితే, ఆమె పెద్ద తమ్ముడి బాధ్యత అమ్మమ్మ తీసుకుంది. చిన్నతమ్ముడు యాదవుల ఇళ్లల్లో పెరిగాడు.
ఇది కూడా చదవండి: నా భార్య అందుకే నన్ను వదిలేసింది . కారణం చెప్పి షాక్ ఇచ్చిన సూర్య కిరణ్
కొన్నాళ్లకు గంగవ్వకు మేనత్త కొడుకుతోనే పెళ్లయింది. అతడు రోజూ తాగొచ్చి గొడవ చేసేవాడు. విపరీతంగా కొట్టేవాడు. ఇద్దరు కూతుళ్లు, కొడుకును పెంచడానికి కష్టాలు పడింది. భర్త ఎనిమిదేళ్ల కిందట చనిపోయాడు. వ్యవసాయ పనులు చేసేది.