21 రోజుల లాక్ డౌన్ వాళ్ళ ఎన్ని కోట్ల నష్టమో తెలుసా

ప్రస్తుతం దేశం లో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరో మూడు వారాల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం అర్ధరాత్రి 21 రోజులపాటు దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ మూడు వారాలను మీ జీవితంలో మర్చిపోండని దేశ ప్రజలను ఆయన కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అని ప్రధాని మోదీ తెలిపారు. మీ ఇళ్ల ముందు లక్ష్మణ రేఖ ఉందన్న ప్రధాని మోదీ గడప దాటి బయటకు రావొద్దన్నారు. ఈ లాక్ డౌన్ కారణంగా ఎంత నష్టం వస్తుందనేది ఓ అంచనా వేశారు.

ఈ లాక్‌డౌన్ వ‌ల్ల సుమారు 120 బిలియ‌న్ల డాల‌ర్లు అంటే 9 ల‌క్ష‌ల కోట్ల మేర ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తినే అవ‌కాశాలు వున్నాయి అని చెబుతున్నారు. ఇది జీడీపీలో 4 శాతం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించాల‌ని కూడా వారు కోరుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన ఆర్బీఐ విధాన‌స‌మీక్ష రిపోర్ట్‌ను వెల్ల‌డించ‌నున్న‌ది. అప్పుడు భారీగా కోత‌లు ఉంటాయ‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్ వ‌ల్ల బ్రిటీష్ బ్రోక‌రేజ్ బార్క్‌లేస్ సంస్థ వృద్ధి రేటును స‌వ‌రించింది. 3.5 శాతం నుంచి వృద్ధి రేటు 1.7 శాతానికి ప‌డిపోనున్న‌ట్లు చెబుతోంది.

Content above bottom navigation