జైల్లో నిర్భయ దోషులు ఎంత సంపాదించారో తెలుసా!

202

నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో నలుగురు ఉరి తాళ్లకు వేలాడారు.. శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఏడేళ్ల తర్వాతైనా నిర్భయకు న్యాయం జరిగిందని.. దేశ్యాప్తంగా అందరూ సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా పేలుస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. నలుగురికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి బంధువులకు డెడ్‌బాడీలను అప్పగించనున్నారు.

తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

Image result for నిర్భయ దోషులు

ఇదిలా ఉంటే జైలు జీవితాన్ని గడిపిన నిర్భయ నిందితులు పనులు చేసి ఎంత సంపాదించారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఉరి వేసిన నలుగురిలో ముగ్గు మాత్రమే పని చేశారు.. ముఖేష్ కుమార్ మాత్రం ఏ పని చేయడానికి ఇష్టపడలేదు. మిగిలిన ముగ్గురు దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్త, వినయ్ శర్మలు మాత్రమే పని చేసి డబ్బులు సంపాదించారు. ముగ్గురు దోషుల్లో అక్షయ్ ఠాకూర్ రూ.69వేలు.. పవన్ గుప్త రూ.29వేలు.. వినయ్ శర్మ రూ.39వేలు సంపాదించారు. ముగ్గురు కలిసి రూ.1,37000 సంపాదించారనమాట. ఈ డబ్బును జైలు అధికారులు వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.ఇక జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్‌ శర్మ 11 సార్లు, అక్షయ్‌ ఒక సారి శిక్ష అనుభవించాడు. ఇక ముఖేష్‌ మూడు సార్లు, పవన్‌ ఎనిమిది సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారు. 2016లో ముఖేష్‌, పవన్‌, అక్షయ్‌.. పదో తరగతిలో అడ్మిషన్‌ తీసుకున్నప్పటికీ వారు పాస్‌ కాలేదు. 2015లో వినయ్‌ బ్యాచిలర్‌ డిగ్రీలో అడ్మిషన్‌ తీసుకున్నాడు.. కానీ పూర్తి చేయలేదు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

ఈ క్రింది వీడియో చూడండి

అందరూ ఉరి శిక్ష వేయడాన్ని స్వాగతిస్తే.. దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ తన ఫ్రస్టేషన్‌తో కనిపించాడు. కేసు ఓడిపోవడంతో కనీసం నలుగురు దోషుల్ని కలిసేందుకు కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. అయితే లాయర్ ఏపీ సింగ్ నిర్భయ తల్లిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నలుగురు దోషులకు వత్తాసు పలుకుతూ.. ఆమెను శిక్షించాలంటూ వ్యాఖ్యలు చేశాడు. నిర్భయ తల్లిని ప్రస్తావిస్తూ.. తన కూతురు ఎక్కడుందో.. రాత్రి 12 గంటల వరకు ఎవరితో ఉందో తెలియదని.. తప్పు ఆమెది.. ఆమెనుశిక్షించాలన్నాడు. ఏపీ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ నలుగురితో పాటూ లాయర్‌ను కూడా ఉరి తీస్తే బావుండేది అంటున్నారు. కొందరు వీడేం మనిషి.. చట్టాల్లో లొసుగులతో ఏడేళ్ల పాటూ కోర్టుల్లో కేసును నాన్చారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలించిందన్నారు. ఇది నిర్భయకు అసలైన నివాళి అంటున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation