నెలసరి 1 రోజులో కావాలంటే ఇది తాగితే చాలు..

266

ఋతుచక్రం స్త్రీలలో నెలనెల జరిగే ఒకరకమైన రక్తస్రావం. ఇవి మొదటిసారిగా రావడాన్ని రజస్వల అవడం అంటారు. ఋతుచక్రాన్ని బహిష్టు, నెలసరి అని కూడా అంటారు. ఇది గర్భాశయం లోని ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఒక నిర్ధిష్టమైన కాల వ్యవధిలో విసర్జించబడి, తిరిగి కొత్తగా తయారు అవుతుంది. ఈ విధంగా విసర్జించబడిన స్రావాల్ని ఋతుస్రావం అంటారు. పెద్దవయసు స్త్రీలలో రుతుక్రమం ఆగిపోటాన్ని మెనోపాజ్ అంటారు. కొంతమందికి నెలసరి పెద్ద సమస్య. ఒక్కోసారి వారం పదిరోజులు ఆలస్యమవుతుంది. కొన్నిసార్లు రెండు, మూడ్రోజుల ముందే వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్‌ గా పీరియడ్స్‌ రావాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

Image result for periods
 • బెల్లం యొక్క వార్మింగ్‌ ఎఫెక్ట్‌ ఋతుస్రావం నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని నువ్వుల విత్తనాలను వేయించి బెల్లంతో పాటు రుబ్బి ఒక స్పూన్‌ పొడిని ప్రతిరోజూ తీసుకోండి.
 • రాత్రి పడుకునే ముందు నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల ఫెన్నెల్‌ విత్తనాల నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడగట్టి త్రాగండి. మంచి ఫలితాలను పొందే వరకు ప్రతి రోజు తాగండి.
 • కలబంద కూడా మీ పీరియడ్స్‌ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్‌ కలబంద జ్యూస్‌ త్రాగండి. లేదా కలబంద యొక్క జెల్‌ లో ఒక స్పూన్‌ తేనె కలుపుకొని ప్రతి రోజు అల్పాహారం తినడానికి ముందు తీసుకోండి. ఫలితాలను పొందే వరకు లేదా రెండు నెలల పాటు ఈ నివారణను అనుసరించండి. అయితే ఋతుస్రావం సమయంలో ఈ చికిత్సను అనుసరించకూడదు.
 • కొన్ని ముల్లంగి గింజలలో కొంత నీటిని జోడించి రుబ్బండి. ఈ పేస్ట్‌ ని మజ్జిగలో కలుపుకొని క్రమ పద్ధతిలో త్రాగండి. మీరు సానుకూల ఫలితాలను చూడాలనుకుంటే, ఈ రసాన్ని ప్రతి రోజూ త్రాగండి.
 • పసుపులో యాంటీ ఆక్సిడెంట్‌ మరియు యాంటీ ఇంఫ్లమ్మెటరి లక్షణాలు ఉన్నాయి. ఇది మీ ఋతుచక్రాన్ని నియంత్రించడంతో పాటు ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. ఒక క్వార్టర్‌ టీస్పూన్‌ పసుపు, కొద్దిగా తేనె, బెల్లం మరియు పాలను కలుపుకొని ప్రతిరోజు తాగండి.
 • ఋతుచక్రాన్ని నియంత్రించేందుకు ఆపిల్‌, బెర్రీస్‌, నారింజ మరియు టమోటాల వంటి విటమిన్‌ సి అధికంగా ఉండే పళ్ళు మరియు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి.

ఈ క్రింది వీడియో చూడండి

 • పండని బొప్పాయిని తినటం వలన మీ ఇర్రెగులర్‌ పీరియడ్స్‌ని నయం చేస్తుంది. ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ ఒక గ్లాస్‌ బొప్పాయి రసం తీసుకోడానికి ప్రయత్నించండి. ఇది మీ ఋతుస్రావంని సులభంగా నియంత్రిస్తుంది.
 • నట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీరానికి కావల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. ఇంకా ఇందులో ఉండే ఫైబర్‌, ప్రోటీనులు హార్మోనులను బ్యాలెన్స్‌ చేసి పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రావడానికి సహాయం పడుతాయి.
 • బాగా ఉడికించిన గుడ్డులో అధిక శాతంలో ప్రోటీనులు, క్యాల్షియం, విటమిన్స్‌ ఉంటాయి. గుడ్డులో ఉండే అధిక ప్రోటీనులు రుతుక్రమ సమస్యలను నివారించడానికి బాగా సహాయపడతాయి.
 • మీ ఇర్రెగులర్‌ పీరియడ్స్‌ని సరిచేయడానికి ఒక మంచి మార్గం నువ్వుల గింజలను తినటం. మరింత పోషకాలను చేర్చడానికి తేనెతో కలుపుకొని తీసుకోవచ్చు.
 • శరీరంలో పోషకాలు మరియు ప్రోటీన్ల స్థాయి తక్కువగా ఉండటం వలనే ఇర్రెగులర్‌ పీరియడ్స్‌ సమస్య ఏర్పడుతుంది. న్యూట్రిషన్‌ స్థాయులు పెంచడానికి తాజా పండ్ల రసాలను త్రాగండి. పండ్లతోపాటు కూరగాయలను కూడా మీ డైట్‌ లో చేర్చుకోండి. ద్రాక్షలు, ఫిగ్‌, క్యారట్‌ జ్యూస్‌లను ప్రతిరోజు తీసుకోండి.

ఇలా కొన్ని ఆహార నియమాలు పాటిస్తే రుతుక్రమం సరైన సమయానికి అవుతుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్లు తప్పకుండ ఈ ఆహారపదార్థాలను రెగ్యులర్ గా తీసుకోండి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation