భార్య మర్మాంగాన్ని గమ్‌తో మూసేసిన భర్త… షాకైన పోలీసులు

202

ఇది జరిగింది ఆఫ్రికాలోని కెన్యాలో. 36 ఏళ్ల డెన్నిస్ ముమోకి తన భార్యపై ఎక్కడ లేని అనుమానాలు. తను బిజినెస్ పనిమీద ఊర్లకు వెళ్తున్నప్పుడల్లా… తన ఇంటికి ఎవరెవరో మగాళ్లు వస్తున్నారనీ, తన భార్యకు కనీసం నలుగురితో ఎఫైర్స్ ఉన్నాయనీ తనలో తనే అనుకుంటూ, అనుమానపడుతూ ఉండేవాడు. ఏ దరిద్రుడు సలహా ఇచ్చాడో గానీ… ఓ రోజు… సూపర్ గ్లూ (ఇదో రకమైన గమ్… చాలా పవర్‌ఫుల్)ని ఇంటికి తెచ్చాడు. రాత్రి భార్య పక్కనే పడుకున్నాడు.

అర్థరాత్రి ఒక్కడే లేచాడు. తాను తెచ్చిన సూపర్ గ్లూ బాటిల్ తెరిచి… నిద్రపోతున్న భార్యను వివస్త్రను చేసి… ఆమె మర్మాంగంపై సూపర్ గ్లూ పోశాడు. కొన్ని క్షణాలకే అది గడ్డ కట్టేసింది. అప్పటికప్పుడు రువాండాకు బిజినెస్ పనిమీద వెళ్లిపోయాడు.

కాసేపటికి ఆమెకు మెలకువ వచ్చింది. తన పరిస్థితి తెలుసుకొని షాకైంది. మర్మాంగం దగ్గర నొప్పి వస్తుంటే… భరించలేక… అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లింది. విషయం తెలుసుకొని డాక్టర్లు షాక్ అయ్యారు. అప్పటికప్పుడు ఆపరేషన్ చేసి… ఏదేదో చేసి… మొత్తానికి ఆ గమ్‌ను తొలగించారు. ఫలితంగా మృత్యువు చెంతకు వెళ్లిన ఆమె… తిరిగి బతికింది.

కట్ చేస్తే… నాల్రోజుల తర్వాత రువాండా నుంచీ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో భార్య ఇంట్లో లేదు. ఆస్పత్రిలో ఉంది. పోలీసులు డెన్నిస్ ఇంటి తలుపు తట్టారు. పాప్‌కార్న్ తింటూ… తలుపు తీశాడు. యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. అప్పుడర్థమైంది డెన్నిస్‌కి తాను చేసింది ఎంత పెద్ద తప్పో. పోలీసులు అతనిపై గృహ హింస, వేధింపులు, మర్మాంగాల్ని నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన నేరాన్ని ఒప్పుకున్న అతను… తన భార్య తనకే సొంతమనీ, ఆమె మర్మాంగాలపై అన్ని హక్కులూ తనకే ఉన్నాయని అంటున్నాడు. ఆమె మరో నలుగురితో వివాహేతర సంబంధాలు నడుపుతోందని ఆరోపించాడు. తన భార్య చాలా మందితో చాటింగ్ చేస్తోందనీ, వాళ్లకు తన నగ్న ఫొటోలను పంపుతోందని వాదించాడు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు విచారణ మొదలైంది.

Content above bottom navigation