ప్రియుడి మోజులో భర్తను చంపిన స్వాతిరెడ్డికి జ్యుడిషియల్ కస్టడీ

28658

భార్వే సర్వస్వం అనుకున్నాడు, బంగారం ఇళ్లు నగలు డిపాజిట్లు స్ధలాలు పొలాలు ఇలా అన్నీ భార్య పేరుమీదే చేయించాడు.అయినా ఆ ప్రేమ కంటే ఆమెకి కామం ఎక్కువ అయింది.. ఆ కామంతో భర్త కంటే పరాయి మగాడిపై మోజు పెంచుకుంది. అడ్డున్న భర్తని ఎవ్వరూ చంపని రీతిలో చంపేసింది.కామంతో కళ్లు మూసుకుపోయిన స్వాతిరెడ్డి, కట్టుకున్న భర్తని చంపేసి ఆ స్ధానంలో పరాయి పురుషుడ్ని తీసుకువచ్చింది. ప్రపంచంలో ఇలాంటి మర్డర్ ప్లాన్ ఏ అమ్మాయి చేసి ఉండదు. ఏకంగా దేశం మొత్తం ఈమె చేసిన పనికి ఆశ్చర్యపోయింది.మహబూబ్ నగర్ ప్రియుడి మోజులో భర్త సుధాకర్ రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి డ్రామా ఆడిన స్వాతి రెడ్డికి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. స్వాతిరెడ్డిని పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆమెను పోలీసులు మహబూబ్ నగర్ జైలుకు తరలించారు .

Husband killer Swathi Reddy sent to judicial custody

నాగర్ కర్నూల్ లో 2017 నవంబర్ లో భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి రెడ్డి ప్రియుడి రాజేష్ తో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. క్రషర్ వ్యాపారంలో బిజీగా ఉండి తనను పట్టించుకోవడం లేదనే ఆసంతృప్తితో స్వాతి రాజేష్ కు దగ్గరైంది. భర్తను హత్య చేసి ఆ స్థానంలోకి రాజేశ్ ను తీసుకుని రావాలని ఆమె పథకం వేసింది. సుధాకర్ రెడ్డిని మట్టుపెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అతని స్థానంలో తాను రావాలని రాజేశ్ ప్లాన్ వేశాడు. రాజేష్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి కూడా స్వాతి రెడ్డి పూనుకుంది. ప్లాస్టిక్ సర్జరీ కోసం రాజేశ్ తన ముఖాన్ని గ్యాస్ స్టవ్ పెట్టి కాల్చుకోవడమే కాకుండా పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు. దాంతో రాజేశ్ ఆస్పత్రి పాలయ్యాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

ముందు స్వాతిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు చికిత్స పూర్తయిన తర్వాత రాజేశ్ ను కూడా అరెస్టు చేశారు. బెయిల్ మంజూరైనా ఎవరూ రాకపోవడంతో ఆమె స్టేట్ హోంలోనే ఉంటోంది. నాన్ బెయిలబుల్ వారంట్ తో ఆమెను పోలీసులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. భర్తని చంపిన ఆమెకి సమాజంలో చోటు లేదు అంటున్నారు అక్కడ గ్రామస్తులు, ఇలాంటి వారి వల్ల మరిన్ని సంఘటనలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు కూడా ఆమెని పట్టించుకోకుండా వదిలేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation