టిక్‌టాక్‌‌ లో భార్య వీడియోలు.. పరువు తీస్తోందని భర్త ఏం చేశాడో తెలిస్తే కన్నీళ్లాగవు ..

165

TikTok… యువత మనసు దోచేసిన వీడియో షేరింగ్ యాప్ ఇది. కుర్రాళ్లలో టిక్ టాక్ యాప్ గురించి తెలియని వాళ్లుండరు. సాదారణంగ ఇప్పుడు ప్రతి ఒక్కరు టిక్ టాక్ ని ఉపయోగిస్తున్నారు. ఈ టిక్ టాక్ ఎంతోమందిని సెలబ్రిటీలను చేసింది. ఇందులో చాలా వరకు మంచి మంచి వీడియోస్ ని అప్లోడ్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటారు. అయితే ఈ టిక్ టాక్ యాప్ కు ఎందరో అడిక్ట్ అయ్యారు. అది ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టింది. ఇప్పుడు మరొక జంట కాపురంలో టిక్ టాక్ నిప్పులు పోసింది. భార్య మీద భర్తకు అనుమానం రావడానికి కారణమయ్యింది. చివరికి ఆమె ప్రాణాలు పోయేలా చేసింది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

ఈ క్రింది వీడియోని చూడండి

తమిళనాడులోని కడూలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియూర్‌ గ్రామానికి చెందిన కుమరవేల్, నైవేలి దిడీర్‌కుప్పానికి చెందిన రాజేశ్వరి(26)ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల టిక్‌టాక్ యాప్‌కు బానిసైన రాజేశ్వరి భర్త, పిల్లలను పట్టించుకోకుండా అదే జీవితంగా జీవిస్తోంది. మంచిగా రెడీ అయి వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తోంది. ఆ యాప్‌లో పరిచయమైన యువకులతో డబుల్‌మీనింగ్ డైలాగులు చెబుతూ వీడియోలు తీయడం, అసభ్యంగా డ్యాన్సులు చేయడం కుమరవేల్‌కి నచ్చలేదు. ఇలాంటి వీడియోలు తీస్తూ భార్య కుటుంబ పరువు తీస్తోందని ఆవేదన చెందేవాడు. దీనికి తోడు స్థానికంగా మెకానిక్‌గా పనిచేసే ఓ వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించేవాడు. ఇవన్నీ వదిలి సంసారాన్ని పట్టించుకోవాలని కోరినా ఆమె పట్టించుకోలేదు.

దీంతో రెచ్చిపోయిన కుమరవేల్ ఆదివారం భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంలో ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేసి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బన్రూట్టి బస్టాండ్ వద్ద తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తన భార్య మెకానిక్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, దీంతోపాటు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ కుటుంబ పరువు తీస్తోందన్న కారణంతోనే చంపేసినట్లు నేరం అంగీకరించాడు. తల్లి హత్య, తండ్రి జైలుకి వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. చూశారుగా ఏం జరిగిందో..కాబట్టి టిక్ టాక్ మోజులో పడి సంసార జీవితాన్ని నాశనం చేసుకోకండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation