కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మరింత ఛిద్రం చేస్తోంది. కరోనా సోకిన కుటుంబసభ్యులను వీధుల్లో వదిలేయడం, కరోనా కారణంగా చనిపోయిన బంధువుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వంటి ఘటనలు చాలా చోట్ల వెలుగు చూస్తున్నాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు కరోనా అని తెలియగానే ఆమెను ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడు ఓ మనసులేని భర్త.
ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. మంజునాథ్ అనే యువకుడు రెండేళ్ల కిందట గౌరి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి ఉపాధి కోసం బెంగళూరు వచ్చిన ఈ జంట ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. గౌరి ఓ ఒక షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్‌గా పని చేస్తుండగా.. మంజునాథ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే కొద్దిరోజుల క్రితం గౌరికి జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అదే సమయంలో కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇచ్చింది.