టిక్‌టాక్‌‌‌లో భార్య హాట్ వీడియోలు.. పట్టించిన ఇంట్లోని వస్తువులు

114

టిక్‌టాక్‌కు బానిసగా మారిన ఓ మహిళ.. విదేశాల్లో ఉంటున్న భర్తకు చుక్కలు చూపించింది. హాట్ డ్యాన్సులతో రెచ్చిపోతున్న భార్య యవ్వారం తేల్చేందుకు ఉద్యోగం మానేసి మరీ వచ్చిన భర్తకు అదిరిపోయే షాకిచ్చింది. ఆమె డ్యాన్సుల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది ఫాలోవర్స్‌ని వదులుకోలేని మహిళ.. తన భర్తకు దిమ్మతిరిగిపోయే నిర్ణయం తీసుకుంది.బెంగళూరుకి చెందిన అహ్మద్, సోనం (పేర్లు మార్చాం) దంపతులు. వారికి 2008లో వివాహమైంది. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడిన అహ్మద్.. బెంగళూరులో విడిగా నివాసం ఉండేవాడు. పెళ్లైన కొద్దిరోజులకే ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పట్నుంచి అతని భార్య సోనం అత్తమామలతో కలసి బెంగళూరులోనే ఉంటోంది. అహ్మద్ వీలుదొరికినప్పుడల్లా ఇండియాకి వచ్చి వెళ్తుండేవాడు. వారికి 2014 లో ఒక అబ్బాయి పుట్టాడు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. అనంతరం భార్య సోనం ప్రవర్తనలో అనూహ్య మార్పులు వచ్చాయి.మూడేళ్ల క్రితం సోనంకు పొరుగున నివాసం ఉండే ఓ మహిళ ఆమెకి టిక్‌టాక్‌‌ యాప్‌ను పరిచయం చేసింది. క్రమంగా సోనం టిక్‌టాక్‌కు బానిసగా మారింది. నకిలీ అకౌంట్‌ సృష్టించి వీడియోలు చేయడం మొదలెట్టింది. యాప్‌లో హాట్ డ్యాన్సులతో రెచ్చిపోయింది. తన వీడియోలకు ఫాలోవర్లు పెరుగుతుండడంతో డోసు మరింత పెంచింది. అలాంటి ఓ అశ్లీల వీడియోనే విదేశాల్లో ఉన్న భర్త కంటపడడంతో కథ అడ్డం తిరిగింది.

ఒక మహిళ అశ్లీల నృత్యం చేస్తున్న టిక్‌టాక్ వీడియోను ఒక స్నేహితుడు అహ్మద్‌కు పంపాడు. అశ్లీలంగా డ్యాన్స్ చేస్తున్నది తన భార్య సోనం అని స్నేహితుడు చెప్పడంతో నమ్మలేకపోయిన అహ్మద్ షాక్‌కు గురయ్యాడు. ఆమె వీడియోకి లక్షల సంఖ్యలో లైక్స్, వేలాది అసభ్యకర కామెంట్స్ ఉండడంతో కోపం కట్టలు తెచ్చుకుంది. భార్యకు ఫోన్ చేసి నిలదీస్తే అలాంటిదేమీ లేదని.. ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టారంటూ భోరుమంది.సోనంపై నమ్మకం కుదరని అహ్మద్.. వెంటనే తన ఉద్యోగాన్ని వదిలేసి మరీ బెంగళూరు వచ్చేశాడు. టిక్‌టాక్ అకౌంట్.. హాట్ డ్యాన్సులపై ఆరా తీయడం మొదలెట్టాడు. తన భార్య నకిలీ పేరుతో టిక్‌టాక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నట్లు గుర్తించాడు. గట్టిగా నిలదీయడంతో అప్పటికే నటనలో పండిపోయిన సోనం.. ఓ హైడ్రామా క్రియేట్ చేసింది. తనను అనుమానిస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుని ఓ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ చేసింది.

ఈ క్రింది వీడియోని చూడండి

అప్పటికీ నమ్మకం కలగని భర్త నిజమో? కాదో? తేల్చుకోలేక సతమతమయ్యాడు. అలాంటి సమయంలో తన ఇంట్లో ఉన్న వస్తువులు అతనికి క్లూ ఇచ్చాయి. మళ్లీ వీడియోలను పరీక్షించి చూడగా ఇంట్లోని వస్తువులు కనిపించాయి. చివరగా ఇంట్లో చేసిన ఒక వీడియో సోనం నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఇక తప్పించుకునే దారిలేక సోనం నిజం కక్కింది. టిక్‌టాక్‌లో వస్తున్న రెస్పాన్స్ చూసి హాట్ డ్యాన్సుల వీడియోలు పోస్ట్ చేసినట్లు అంగీకరించింది.అనంతరం భర్త అహ్మద్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేసినా భార్య మాత్రం అదిరిపోయే షాకిచ్చింది. లక్షల మంది ఫాలోవర్లను వదులుకోలేక మొగుడిని వదిలేయడానికి సిద్ధపడింది. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని సోనం నిర్ణయించుకుందట. ఇకపై ఎప్పటిలాగే టిక్‌టాక్‌లో కొనసాగాలని డిసైడ్ అయిందట.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation