హైదరాబాద్ డీమార్ట్‌లో దారుణం

138

హైదరాబాద్ వనస్థలిపురంలో డీమార్ట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి చాక్లేట్ దొంగలించాడని అతడ్ని పట్టుకొని కొట్టారు. దీంతో ఆ దెబ్బలకు తాళలేక… విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. వివరాల్లోకి వెళ్తే… నల్గొండ జిల్లాకు చెందిన సతీష్ నాయక్ హయాత్ నగర్ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండీయర్ చదువుతున్నాడు. రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి డీమార్ట్‌కు వెళ్లాడు. అయితే అక్కడ సతీష్ చాక్లేట్ దొంగలించాడని అతడ్ని డీమార్ట్ సిబ్బంది, సెక్యూరిటీ కలిపి చావాబాదారు. ఆ దెబ్బలు తాళలేక సతీష్ అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో అతడ్ని వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తరలించారు. కానీ.. అప్పటికే సతీష్ చనిపోయాడాని డాక్టర్లు నిర్ధారించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ముగ్గురు విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు సమాచారం లేకుండా డీమార్ట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ సిబ్బందితో గొడవ జరిగే సమయంలో సతీష్‌తో ఉన్న మరో ఇద్దరు విద్యార్థులు…అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సతీష్ తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఒక వేళ తమ బిడ్డ చాక్లేట్‌ను దొంగలిస్తే… పోలీసులకు అప్పగించాలని కానీ… ఇలా చనిపోయేలా కొడతారా అంటూ.. బోరున విలపిస్తున్నారు. ఏదైనా దొంగతనం జరిగితే వెంటనే.. పోలీసులకు చెప్పాలి.. లేదంటే తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సలింగ్ ఇవ్వాలి కానీ.. ఇలా చాక్లెట్ దొంగలించాడని చనిపోయేలా కొట్టడం ఏంటని సామాన్యలుు సైతం ప్రశ్నిస్తున్నారు. డీమార్ట్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమండ్ చేస్తున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి


Content above bottom navigation