యువకుడితో లాడ్జిలో రొమాన్స్ చేసి.. రూ.4.49లక్షలు దోచుకున్న కిలేడీ

135

సోషల్‌మీడియాలో పరిచయమైన యువకుడితో రాసలీలలు సాగించి ఆ సమయంలో తీసిన వీడియోలు బయటపెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న జంటను హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌ కావూరి హిల్స్‌కి చెందిన మణికంఠకు కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌ అప్లికేషన్లు పూర్తి చేసే క్రమంలో మహేశ్వరి(22) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే 14వ తేదీన వీరిద్దరూ కూకట్‌పల్లి విజయానగర్‌ కాలనీలోని ఓ లాడ్జిలో ఏకాంతంగా గడిపారు. ఆ సమయంలో మహేశ్వరి యువకుడికి తెలియకుండా వీడియో తీసింది.

మరుసటి రోజే మహేశ్వరి స్నేహితుడు సంతోష్‌తో మణికంఠకు ఫోన్‌ చేయించి లాడ్జిలో గడిపిన వీడియోలు తన దగ్గరున్నాయంటూ బ్లాక్‌మెయిల్ చేయించింది. వీరిద్దరు కూకట్‌పల్లి పోలీసులమని నమ్మించి బాధితుడి నుంచి రూ.4.49 లక్షల నగదుతో పాటు ఐఫోన్ దోచుకున్నారు. మరోసారి అతడికి ఫోన్ చేసిన సంతోష్ మరో రూ.లక్షన్నర ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో మణికంఠ ఈ నెల 22వ తేదీన మదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును కేపీహెచ్‌బీ పీఎస్‌కు బదిలీ చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation