వాళ్ళిద్దరిని నా టీం నుంచి తీసేస్తున్నా.. ఫైర్ అయిన హైపర్ ఆది

96

జబర్దస్త్ కామెడీ షోకు చాలా మంచి ఇమేజ్ ఉంది. ఇలాంటి కామెడీ షో రావడం వల్లే చాలా మంది నటులు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యారు. ఈ రోజు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి చాలా మంది కమెడియన్లు ఈ షో నుంచి ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇంకా ఎంతోమందికి జబర్దస్త్ కామెడీ షో అన్నం పెడుతుంది. ఇప్పటి వరకు కేవలం నవ్వులతోనే ఎక్కువగా పరిచయమున్న ఈ షో ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఇందులో నటించే ఇద్దరు కమెడిచన్లు ఇప్పుడు ఏకంగా వ్యభిచారం చేస్తూ.. నిర్వహిస్తూ దొరికిపోవడంతో సంచలనంగా మారింది. హైపర్ ఆది టీంలో చేసే దొరబాబు, పరదేశీ వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మీద వాళ్ళ టీమ్ లీడర్ హైపర్ ఆది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

వైజాగ్ లో దొరబాబు, పరదేశీ వ్యభిచారం చేస్తు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తుంటే వీళ్లకు చాలా రోజులుగా దీనితో సంబంధం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే దొరబాబు, పరదేశీపై ఇప్పుడు మల్లెమాల టీం చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. వాళ్లకు వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఉన్నఫలంగా వాళ్లను జబర్దస్త్ నుంచి బయటికి పంపే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైపర్ ఆది టీంలో పరదేశీకి అంత క్రేజ్ లేదు కానీ దొరబాబు మాత్రం చాలా సీనియర్. మంచి కమెడియన్ కూడా. అతడిపై ఎప్పుడూ అలాంటి జోకులే వేస్తుంటాడు ఆది. ఇప్పుడు అదే నిజం చేసుకున్నాడు దొరబాబు. జబర్దస్త్‌ లోకి రాకముందు కూడా ఈయన యూ ట్యూబ్‌లో బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. దాంతో అదే జోకులు ఇక్కడ కూడా వేసేవాడు హైపర్ ఆది. అలాగే ఎక్కువ కామెడీ పుట్టించేవాడు. ఇప్పుడు నిజంగానే వ్యభిచారం చేస్తూ దొరికిపోవడంతో జబర్దస్త్‌లో వీళ్లకు నూకలు చెల్లినట్లే అని తెలుస్తుంది.

Image result for hyper adhi dorababu

ఆది కూడా వీళ్ళ మీద ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి వాళ్ళు తన టీమ్ లో ఉంటె తన స్కిట్స్ ను జనాలు చూడరు అని, జనాల నుంచి తనకు వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉందని గ్రహించి వాళ్ళు నా టీమ్ నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించాడు. ఇక వాళ్ళ మీద మల్లెమాల వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. కాని వాళ్ళిద్దరిని నా టీమ్ లో మాత్రం కంటిన్యు చెయ్యను అని చెప్పేశాడు హైపర్ ఆది. ఇది ఇలా ఉంటే వాళ్లతో పాటు మిగిలిన వాళ్లకు కూడా సీరియస్ వార్నింగ్ వెళ్లినట్లు తెలుస్తుంది. బయట ఈవెంట్స్ ఒప్పుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ముందు వెనక చూసుకుని అటు వైపు వెళ్లాలని మల్లెమాల సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఇప్పుడు జబర్దస్త్ మరోసారి దొరబాబు, పరదేశీ కారణంగా వార్తల్లో నిలిచింది. మరి ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. మిగిలిన జబర్దస్త్ కమెడియన్లపై కూడా ఈ ప్రభావం పడేలా కనిపిస్తుంది. అందరిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు కూడా భావిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation