నేటి నుంచి బ్యాంకుల్లో ఆ సేవలన్నీ బంద్!

బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఖాతాదారుడు ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిన‌ విష‌యం ఇది. ఎందుకంటే.. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చాలా వ‌ర‌కు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో చాలా ర‌క‌లా ప్ర‌జాసేవ‌లు నిలిచిపోయాయి. కొన్నింటిలో వెసులుబాటు క‌ల్పించారు. అందులో భాగంగానే ప‌లు బ్యాంకులు కూడా అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. బ్యాంకుల్లో మార్చి 23 నుంచి కేవలం కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.వివ‌రాల్లోకి వెళితే…

ఇంట్లోనే హ్యాండ్ సానిటైజర్ ఇలా తయారు చేసుకోండి (వీడియో)

janta curfew indian banks association assures uninterrupted banking services, నేటి నుంచి బ్యాంకుల్లో ఆ సేవలన్నీ బంద్!

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా ప్రభావం పడుతున్న తరుణంలో తమ అనుబంధ బ్యాంకులు కస్టమర్లకు మెరుగైనా సేవలు అందిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐబీఏ పేర్కొంది. కస్టమర్లకు అవరమైన సేవలన్నింటినీ సాధ్యమైనంత వరకు అందజేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ, ఖాతాదారుల‌కు ఒక ముఖ్య‌మైన విన‌తి అంటూ…బ్యాంక్ కస్టమర్లు అవసరం ఉంటే తప్ప బ్యాంక్ బ్రాంచులక రావొద్ద‌ని సూచించింది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ పాయల్ ఘోష్

ఈ క్రింది వీడియో చూడండి

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలనే త‌మ‌ ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నార‌ని చెప్పింది. అందువల్ల త‌మ‌కు కూడా మీ సాయం కావాల‌ని ఐబీఏ వివరించింది.
చాలా వరకు బ్యాంకింగ్ సర్వీసులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని,  అందువల్ల మొబైల్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా నాన్ ఎసెన్షియల్ సర్వీసులను పొందొచ్చని సూచించింది. 24 గంటలూ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నామని పేర్కొంది. ఇంకా అవసరం అయితే బ్యాంక్ బ్రాంచ్‌కు కాల్ చేయొచ్చని, లేదంటే ఐవీఆర్ ఫెసిలిటీ ద్వారా సర్వీసులు పొందొచ్చని తెలిపింది.మార్చి 23 నుంచి అన్ని బ్యాంకులు కొన్ని సర్వీసులను కచ్చితంగా కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని ఐబీఏ తెలిపింది. క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ క్లియరింగ్, రెమిటెన్స్‌లు, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు వంటి సేవలు తప్పక అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నాన్ ఎసెన్షియల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation