ఐపిఎల్ సీజన్ 2020 ని మిస్ అవుతున్న ప్రముఖ విదేశీ క్రికెటర్లు..

65

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ కు రంగం సిద్దమయింది..వచ్చే నెల 29 వ తేదీ నుంచి ముంబై వేదికగా ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది..తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్..చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది..మే 24 న ముంబైలో ఐపిఎల్ ఫైనల్ జరుగుతుంది..అయితే కొన్ని కారణాలతో ఐపిఎల్ కు ఈ సారి కొంత మంది ఆటగాళ్ళు పూర్తిగా లేదా కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది..గాయాలు వ్యక్తిగత కారణాలు జాతీయ జట్టు తరపున సీరీస్ లు ఆడడం వంటి కొన్ని కారణాలతో కొందరు ఆటగాళ్ళు ఈ ఐపిఎల్ లో ఆడలేక పోతున్నారు.. మరి ఆ ఆటగాళ్ళు ఎవరో వారి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..మార్చి నెలలో ఆస్ట్రేలియా న్యూజీలాండ్ జట్ల మధ్య వైట్ బాల్ క్రికెట్ సీరీస్ లు ఉండడంతో ఇరు దేశాలకు చెందిన క్రికెటర్లు మార్చి లో జరిగే ఐపిఎల్ కు దూరమవనున్నారు..ఈ సీరీస్ లు ముగిసాక మార్చి 30 నుంచి ఇరుదేశాల ఆటగాళ్ళు ఈ మెగా టోర్నీకి అందుబాటులోకి వస్తారని ఇరుదేశాల క్రికెట్ బోర్డులు స్పష్టం చేసాయి..ఈ నేపధ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆడే తొలి మ్యాచ్ కు స్టీవ్ స్మిత్ దూరమవుతాడు..అలాగే ఆసీస్ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కేన్ రిచర్డ్సన్ ఇదే కారణంతో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకు అందుబాటులో ఉండరు..

Image result for finch and smith

అలాగే గతేడాది 15.5 కోట్ల రూపాయలకు అమ్ముడైన పాట్ కమిన్స్ కూడా కోల్ కతా నైట్ రైడర్స్ కు దాదాపు ఏప్రియల్ నెలలోనే తన సేవలు అందించనున్నాడు..సన్ రైజర్స్ ఆటగాళ్ళు కేన్ విలియంసన్ డేవిడ్ వార్నర్ తో పాటు ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా తొలి మ్యాచ్ కు దూరమవుతారు..అలాగే ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపిఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి..కుడి మోచేతి గాయం కారణంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ సీరీస్ లకు ఆర్చర్ దూరమయ్యాడు..సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సీరీస్ తో పాటు మార్చిలో శ్రీలంక తో జరిగే టెస్ట్ సీరీస్ కు అతను అందుబాటులో ఉండడం లేదని ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ పేర్కొంది..అలాగే ఐపిఎల్ టోర్నీ మొత్తానికి తాను అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది..అలాగే ఇంగ్లాండ్ కు చెందిన సాం కరన్ కూడా ఐపిఎల్ తొలి తుది దశలకు దూరమయ్యే అవకాశం ఉంది..

ఈ క్రింది వీడియో చూడండి

టెస్ట్ జట్టులో కీలక ఆటగాడైన కరన్ శ్రీలంక వెస్టిండీస్ లతో సీరీస్ ల కారణంగా కొద్ది కాలం పాటు ఐపిఎల్ కు దూరమవుతాడు..శ్రీలంక సీరీస్ మార్చి 19 నుంచి 31 వరకూ జరుగుతుండగా విండీస్ సీరీస్ జూన్ 4 నుంచి ప్రారంభమవుతుంది..ఈ రెండు సీరీస్ లలోనూ కరన్ కు ప్లేస్ దక్కే అవకాశం ఉంది..గతేడాది డిసెంబర్ లో జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తనను 5.5 కోట్లకు బుక్ చేసుకుంది..అలాగే ఇంగ్లాండ్ క్రికెటర్లు జాస్ బట్లర్, బెన్ స్టోక్స్ ఈ సీజన్లో రాజస్థాన్ తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. అయితే ఐపిఎల్ ఆరంభం తో పాటు ప్లే ఆఫ్స్ కు వీళ్ళు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది..శ్రీలంక తో టెస్ట్ సీరీస్ ముగిసాక మార్చి 31 న భారత్ కు వచ్చి టోర్నీలు ఆడతారు..మరో వైపు జూన్ 4 న వెస్టిండీస్ తో జరిగే సీరీస్ కోసం వీళ్ళు ప్లే ఆఫ్స్ కు అందుబాటలోకి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది..ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation