భారత్‌లోని ఏడు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగించే పరిస్థితులు..

120

లాక్‌డౌన్ అనేది పేద ప్రజలకు, రోజువారీ కూలీలకు నరక ప్రాయమే. అది ఎన్ని రోజులు కొనసాగిస్తే అన్ని రోజులూ వారు తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ… తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నట్లు… లాక్‌డౌన్ ఎత్తివేస్తే… పేదలకే కాదు… అన్ని వర్గాలకూ ప్రమాదమే. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సీఎం కేసీఆర్ చాలా ముందుచూపుతో మాట్లాడారనీ, ప్రపంచ దేశాల్ని గమనిస్తే… ఆయా దేశాల్లో లాక్‌డౌన్ అనేది దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. ఐతే… కేసీఆర్… ఏదో ఊహాతీతంగా ఈ వ్యాఖ్యలు చెయ్యలేదనీ, పక్కా కారణాలు ఉండటం వల్లే ఇలా చేశారని తెలుస్తోంది.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న మౌని రాయ్

Popular Narendra Modi can afford to keep his fiscal promise

ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసులు … కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాల్లో మూడో దశకు చేరుకుంది, అంటే స్థానికుల నుంచి స్థానికులకు వ్యాప్తి ద‌శ‌కు చేరుకుంది. అంటే… వైరస్ విజృంభిస్తున్న దశ ఇది. పైగా… తెలుగు రాష్ట్రాలతోపాటూ… మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ సహా ఏడు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.ఈ ఏడు రాష్ట్రాల కేసులూ కలిపితే… అవే 1400 దాకా ఉన్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో (4281) ఇవి మూడింట ఒక వంతు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో తప్పనిసరిగా ఏప్రిల్ 21 తర్వాత లాక్‌డౌన్ కొనసాగించడం మంచిదంటున్నారు నిపుణులు. ఒకవేళ లాక్‌డౌన్ వద్దనుకుంటే… కనీసం కచ్చితమైన కండీషన్లైనా పెట్టుకోవాలని అంటున్నారు. లేదంటే… వైరస్ మళ్లీ మరింత ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికల్ని గుర్తు చేస్తున్నారు.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

Narendra Modi calls 2-day meeting to discuss farm issues

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదనకు మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు మద్దతిచ్చాయి. నిజానికి ఈ రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో వైరస్ అంతగా లేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రాలు ముందు జాగ్రత్తగా లాక్‌డౌన్ అప్పుడే ఎత్తివేయవద్దని అంటున్నాయి. జస్ట్ 26 కేసులే ఉన్న అసోం… లాక్‌డౌన్ ఎత్తివేస్తే… తమ రాష్ట్రంలోకి వచ్చే ప్రతి ఒక్కరికీ రిజిస్ట్రేషన్ చేస్తామని అంటోంది. 748 కేసులతో ఉన్న మహారాష్ట్ర… ముంబై, పుణె సహా చాలా హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్ కొనసాగిస్తామంటోంది.ఢిల్లీ ప్రార్థనల తర్వాత 305 కేసులకు చేరిన ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత అంశంపై… సందిగ్ధత ఉంది. దశల వారీగా ఎత్తివేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 274 కేసుల రాజస్థాన్… హై రిస్క్ జోన్‌లపై ఎక్కువ దృష్టి పెడుతోంది. అక్కడ లాక్‌డౌన్ కొనసాగించేలా ఉంది. 10 కేసుల చత్తీస్‌గఢ్ ప్రభుత్వం… లాక్‌డౌన్ ఎత్తివేయవద్దని ఆల్రెడీ ప్రధాని మోదీకి లేఖ రాసింది. లాక్‌డౌన్ ఎత్తివేస్తే… తమ రాష్ట్రంలోకి ఎవరెవరు రావాలో తామే నిర్ణయిస్తామని అసోం ప్రభుత్వం తెలిపింది.

165 కేసుల మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం… ఏప్రిల్ 15 నుంచి గోధుమల సేకరణ ప్రారంభిస్తామంది. తద్వారా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్… లాక్‌డౌన్ ఎత్తివేస్తామన్నట్లుగా మాట్లాడారు. ఇలా రాష్ట్రాలన్నీ క్రమంగా లాక్‌డౌన్ కొనసాగించే వైపుగా ఆలోచనలు చేస్తున్నాయి. అదే జరిగితే… పేదలు, రోజువారీ కూలీలకు తప్పనిసరిగా చేతిలో డబ్బు ఉండేలా చెయ్యాల్సి ఉంటుంది. ఆర్థిక ప్యాకేజీ డబ్బులు, నిత్యవసర సరుకులు పేదల ఇళ్లకు చేరేలా ప్రభుత్వాలు గట్టిగా చెయ్యాల్సి ఉంటుంది. అలా జరగకపోతే, లాక్‌డౌన్ వల్ల వాళ్లు మరిన్ని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది.

Content above bottom navigation