భారత్‌లో కరోనా విలయం తప్పదు.. మెరుపువేగంతో వైరస్ వ్యాప్తి.. ప్రపంచ భారమూ మీదే

మహమ్మారి కరోనా ప్రభావం.. అది పుట్టిన చైనాలో తగ్గుముఖంపడుతూ.. క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరించింది. చైనాలో బుధవారం నాటికి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయనుండగా.. ఇతర దేశాల్లో మాత్రం ఇటీవలే లాక్ డౌన్ కు ఆదేశాలు వెలువడ్డాయి. చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న భారత్ లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. మంగళవారం నాటికి ఇండియాలో 10 మంది చనిపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య 500కు పెరిగింది. వైరస్ వ్యాప్తి గతంలో కంటే వేగంగా ఉండటం.. చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న ఇండియాకు పెనుసవాలుగా మారింది. భారత్ లో విలయం తప్పదంటూనే.. వ్యాధిని ఢీకొట్టే విషయంలోనూ ప్రపంచానికి మీరే దిక్సూచిగా నిలుస్తారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక వ్యాఖ్యలు చేసింది.గతేడాది డిసెంబర్ చివర్లో చైనాలో కరోనాను గుర్తించినప్పటి నుంచి.. ప్రస్తుతం(మార్చి చివరి వారం) దాకా వైరస్ వ్యాప్తి వేగాన్ని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే.. వైరస్ గత రెండు నెలల కంటే.. ఇప్పుడు మరింత వేగంగా ప్రజల్ని కబళిస్తున్నది. కరోనా వైరస్ పుట్టిన తొలి 67 రోజుల్లో.. కేవలం చైనా వరకే పరిమితమై.. సుమారు లక్ష మందికి సోకంది. కానీ ఆ తర్వాత 11 రోజుల్లో మాత్రం.. వైరస్ విదేశాలకు వ్యాపించడంతో బాధితుల సంఖ్య అమాంతం రెండు లక్షలకు పెరిగింది. గత శనివారం నుంచి ఇవాళ్టి(మంగళవారం) దాకా మరో లక్ష మందికి కొవిడ్-19 నిర్ధారణ అయింది. అంటే వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నట్లేనని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనామ్ అన్నారు.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఇదీ మన చరిత్ర..

మార్చి చివరి వారం నాటికి ఇండియాలో కోరనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేగాన్ని బట్టి.. పరిస్థితి ఇలాగే కొనసాగితే విలయం తప్పదని, కనీసం 30 కోట్ల మంది కొవిడ్‌-19 బారినపడే అవకాశముందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ డైనమిక్స్‌, ఎకనామిక్స్‌ అండ్‌ పాలసీ(సీడీడీఈపీ) డైరెక్టర్‌ రమణన్‌ లక్ష్మీనారాయణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతటా లాక్ డౌన్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బాధితుల సంఖ్యను 20 కోట్లకు పరిమితం చేయగలమని ఆయన అన్నారు. భారతీయుల్లో రోగనిరోదక శక్తి ఎక్కువ అనే వాదనను రమణన్ తోసిపుచ్చారు. ఇమ్యూనిటీ తక్కువ కాబట్టే భారతీయుల్లో కొన్ని లక్షల మంది ఏటా ఫ్లూ బారిన పడతారని, కరోనా విషయంలోనూ వైద్య సౌకర్యాలు పెంచుకోకపోతే కనీసం పాతిక లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.చైనాలో వైరస్ తగ్గుముఖం పట్టడంతో, రెండో అతి పెద్ద జనాభా ఉన్న దేశంగా భారత్.. వైరస్ విస్పోటం అంచుల్లో నిలబడిందని, జనసాంద్రత ఉక్కువగా ఉండి, ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని, దాని ప్రభావం కూడా ఇండియాలో సుదీర్ఘకాలం కొనసాగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తున్నది. ముప్పును ఎదుర్కోవాలంటే పెద్ద సంఖ్యలో ల్యాబ్ లు, ఆస్పత్రుల్లో సదుపాయల పెంపు అవసరమని డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మికాయెల్ ర్యాన్ అన్నారు. అయితే, గత చరిత్ర దృష్ట్యా కరోనాను తరిమేయగల సత్తా కూడా భారత్ కే ఉందని ఆయన చెప్పడం గమనార్హం.

కుర్రకారుని మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

ఇండియాకు పెనుసవాల్..

వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో చైనా సక్సెస్ సాధించింది. మొదటి నుంచే అక్కడి ప్రజలపై సైన్యం, ప్రభుత్వం పెత్తనం కొనసాగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయగలిగింది. ఇండియా, అమెరికా లాంటి ప్రజాస్వామిక దేశాల్లో లాక్ డౌన్ ప్రక్రియకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రభుత్వాలు కష్టపడాల్సివస్తున్నది. అయితే పెద్ద పెద్ద జనసమూహాలుండే చోట కూడా కరోనా వ్యాప్తి చెందకుండా నివారించగల ఉపాయాన్ని భారతీయులే కనిపెట్టాల్సిఉందని, ఆ మేరకు ప్రపంచ భారమంతా భారత్ పైనే ఉందని డబ్ల్యూహెచ్‌వో ఈడీ పేర్కొనడం గమనార్హం. గతంలో మశూచి, పోలియో లాంటి మహమ్మారుల్నివిజయవంతంగా తరిమికొట్టిన చరిత్ర భారత్ కు ఉందని, ఇప్పుడు కరోనాను కూడా ధీటుగా ఢీకొట్టగలదని ఆశిస్తున్నట్లు మికాయెల్ అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృత్యువిలయం కొనసాగుతున్నది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటి దాకా(మంగళవారం మధ్యాహ్నం వరకు) 16,584 మంది చనిపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. అదే సమయంలో వైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. ఇండియాలో కేసుల సంఖ్య 500కు పెరగ్గా, 10 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Content above bottom navigation