రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన బుడ్డోడు

అదృష్టం దురదృష్టం అనేవి ఎప్పుడు వస్తాయో ఎటునుంచి వస్తాయో ఎవరికీ తెలియదు.ఆ రెండు చెప్పి రావు.అదృష్టం వస్తే బీదవాడిగా ఉన్నవాడు ఉన్నట్టుండి కోటీశ్వరుడు అవుతాడు. అదే దురదృష్టం వస్తే కోటీశ్వరుడిగా ఉన్నవాడు ఉన్నట్టుండి బిచ్చగాడిలా మారుతాడు. ఇలా మారినవారిని మనం చాలా మందిని చూసాం కూడా. ఇప్పుడు ఇలాగే అదృష్టం వరించి అకౌంటెంట్ గా ఉన్న అతను కోటీశ్వరుడు అయ్యారు. ఉపాధి వేట కోసం గల్ఫ్ వెళ్లిన ఓ భారతీయుడికి కొడుకు రూపంలో అదృష్టం వచ్చింది. ఏకంగా రూ. 7 కోట్ల విలువ చేసే లాటరీ తగలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

lottry

కేరళకు చెందిన రమీస్‌ రహ్మాన్‌ అనే వ్యక్తి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆరేళ్లుగా అక్కడనే నివసిస్తున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఇతని ఏడాది బాబు ఉన్నాడు. ఈ క్రమంలో అక్కడ నిర్వహిస్తున్న లాటరీ టికెట్‌లో తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోవాలనుకున్నాడు. వెంటనే తన ఏడాది వయసున్న కొడుకు మహమ్మద్‌ సాలా పేరు మీద టికెట్‌ కొనుగోలు చేశాడు. సిరీస్ 323కు సంబంధించి 1319 నెంబర్ గల టికెట్‌ను రమీస్ కొన్నాడు. తర్వాత దాన్ని అతడు మర్చిపోయాడు. మంగళవారం నాడు లాటరీ సంస్థ నిర్వాహకులు లక్కీడ్రా నిర్వహించగా అందులో మహ్మద్ సాలా పేరు మీద లాటరీ వచ్చింది. ఈ లాటరీ తీసిన ఆ సంస్థ రమీస్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్టు వెల్లడించింది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు అన్నమాట. లాటరీలో మహమ్మద్‌ పేరు రావడంతో అతని తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ‘ఇది నిజంగా ఎంతో సంతోషకరమైన వార్త. ఇక నాకు ఎలాంటి ఢోకా లేదు. లాటరీ డబ్బు నా కుమారుడి భవిష్యత్తుకు ఎంతగానో భరోసానిస్తుంది. ఈ డబ్బంతా నా కొడుకు భవిష్యత్ కు ఖర్చు చేస్తా అని రమీస్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ కోతలు పోను అతనికి 4.5 కోట్లకు పైగా వస్తుందని కంపెనీ చెప్పింది. కాగా గతంలోనూ చాలామంది భారతీయులు లక్కీడ్రాలో తమ అదృష్టాన్ని నిరూపించుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఓ భారతీయ రైతు ఉపాధిని వెతుక్కుంటూ దుబాయ్‌కు వలస వచ్చాడు. కానీ సరైన ఉపాధి దొరక్కపోవడంతో భారత్‌కు తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర చిల్లిగవ్వ లేకపోయినప్పటికీ భార్య దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని మరీ లాటరీ టికెట్‌ కొనుగోలు చేయగా 4 మిలియన్‌ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో అతని దిశే తిరిగిపోయింది. అంతే అదృష్టం అనేది ఉంటె ఇలాగె జరుగుతుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation