కొడుకులు పున్నామి నరకం నుంచి తప్పిస్తారు అని అంటారు.అందుకే వారసులు అబ్బాయిలే ఉంటారు – కుటుంబానికి దిక్కు కుమారులే అని నాటి నుంచి మనం పాటిస్తాం.కాని రోజులు మారాయి .. కొడుకులే కాదు కూతుళ్లకి తల్లిదండ్రులపై బాధ్యతలు ఉంటాయి అని నిరూపిస్తున్నారు నేటి యువత.తల్లిదండ్రులు చనిపోతే కొడుకు కర్మకాండ జరిపించడం తెలిసిందే.ఇది సర్వ సాధారణం. అయితే కొడుకులే ఆ పని చేయాల్సిన అవసరం లేదని,కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు ఇద్దరు అక్కా చెల్లెల్లు. సాధారణంగా జరిగే దానికి భిన్నంగా కుమార్తెలే కొడుకులయ్యారు. తండ్రి భౌతిక కాయాన్ని కడవరకు తీసుకెళ్లారు. ఆయనకు అంతిమ సంస్కారాలు చేసి ఆయన రుణం తీర్చుకున్నారు ఈ మహిళా మూర్తులు,మరి వారు ఎవరు అనేది చూద్దాం.
ఈ క్రింది వీడియో చూడండి
ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆడపాల హనుమంతురావు ఆయన వయసు 64 సంవత్సరాలు ఆయన ఇటీవల అనారోగ్యంతో మృతిచెండాడు. అతనికి కొడుకులు లేరు. హనుమంతురావుకు భార్య పద్మావతి, కూతుళ్లు సృజన, స్పందన ఉన్నారు. వారికి ఇద్దరికి వివాహమైంది. ఒకరు అమెరికా, మరొకరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తండ్రి మరణించటంతో కన్నీరు మున్నీరు అవుతూ పర్చూరులోని నివాసానికి వచ్చారు. కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు వాపోతున్న సమయంలో కూతులిద్దరూ ముందుకొచ్చారు. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి చితికి నిప్పటించారు. పెద్ద కూతురు దహనక్రియకు ఉపయోగించే నిప్పుల కుంపటి పట్టుకోగా చిన్న కూతురు స్పందన పిండం పట్టుకొని తండ్రి పాడె వెంట నడిచారు. స్థానిక స్మశాన వాటికలో హనుమంతురావు భౌతిక కాయాన్ని కట్టెల పాడెపై ఉంచగా చిన్న కుమార్తె స్పందన తండ్రి భౌతిక కాయానికి తలకొరివి పెట్టింది.
తండ్రికి తలకొరివి పెట్టి జన్మనిచ్చిన రుణం తీర్చుకున్నారు ఆ కూతుళ్లు….. కొడుకులైనా, కుమార్తెలైనా తల్లిదండ్రుల కన్నపేగు మమకారాన్ని మరువకూడదనే సత్యాన్ని చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. నిజమే నాటి నుంచి అదే విలువలు మనం పాటిస్తున్నాం, అందరికి కుమారులు ఉండాలి అని లేదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇలా రుణం తీర్చుకోవడంలో తప్పు లేదు అంటోంది సమాజం, ఇవన్నీ మనం రాసుకున్న రాతలే, మనం పాటిస్తున్న ఆచారాలే అని అంటున్నారు, నిజంగా ఆయన కూతుర్లు చేసిన పనికి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది.
ఈ క్రింది వీడియో చూడండి