మరో మిర్యాలగూడ ఘటన.. కూతురి కులాంతర వివాహం చేసుకుందని కిడ్నాప్ చేసిన తండ్రి

195

దేశవ్యాప్తంగా మిర్యాలగూడ కులాంతర వివాహ ఘటన ఎంత సంచలన స్పృష్టించిందో మనకు తెలుసు. కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కక్షగట్టి కూతురు భర్త ప్రణయ్‌ని దారుణంగా హత్య చేయించాడు అమ్మాయి తండ్రి మారుతీరావు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత రెండు రోజుల క్రితం అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి మన అందరికి తెలుసు. విషాదాంతంగా ముగిసిన ఈ ఘటన కక్షలు, కార్పణ్యాలతో సాధించిందేమీ లేదని కళ్లకు కడుతున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. దేశంలో ఏదో మూలన ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపంతో రగిలిపోయిన ఓ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు ఈరోడ్ జిల్లా భవానికి చెందిన సెల్వం, ఇలమది ఒకే కంపెనీలో పనిచేసేవారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. తమ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించరని, దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సేలం మెట్టూరుకి చెందని ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఈశ్వరన్ సాయంతో, ఆయన సమక్షంలోనే సెల్వం, ఇలమది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కులాంతర వివాహం చేసుకుని ఇంటికి వచ్చేశారు. అయితే కూతురు కులాంతర వివాహం చేసుకుందని తెలిసిన వధువు ఇలమది తండ్రి జగన్నాథన్ దారుణానికి ఒడిగట్టాడు. కూతురి కులాంతర వివాహంతో రగిలిపోయిన జగన్నాథన్, వధూవరులతో సహా పెళ్లి జరిపించిన ఈశ్వరన్‌ ని కిడ్నాప్ చేయించాడు. అర్ధరాత్రి వేళ ఈశ్వరన్ ఇంటికి వరుసగా కార్లు వచ్చి ఆగాయి. వెంటనే పదుల సంఖ్యలో జగన్నాథన్ అనుచరులు, బంధువులు ఈశ్వరన్‌ పై దాడి చేసి కొట్టుకుంటూ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

Image result for మరో మిర్యాలగూడ ఘటన.

ఈశ్వరన్‌ ను తీసుకెళ్లిన విషయం తెలియడంతో వధూవరులు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. బైక్‌ పై పారిపోతున్న నూతన జంటను సినిమా స్టైల్లో కార్లలో ఛేజ్ చేసి మరీ పట్టుకుని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ముగ్గురినీ వేర్వేరు కార్లలో పడేసి వేర్వేరు రూట్లలో పంపించేశారు.స్థానిక నాయకుడు ఈశ్వరన్‌ ను కిడ్నాప్ చేయడంతో ఆ పార్టీ శ్రేణులు పోలీసులను అప్రమత్తం చేశారు. కులాంతర వివాహం జరిపించినందుకు తమ నేతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని, నూతన జంటను కూడా కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి ఘోరం జరగకూడదని అర్ధరాత్రి వేళ అణువణువూ జల్లెడ పట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి వాహనాలు వెళ్లిన రహదారుల్లో చెక్‌ పోస్టులను అప్రమత్తం చేశారు. అన్ని వాహనానలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఎట్టకేలకు పార్టీ నాయకుడు ఈశ్వరన్, నూతన వరుడు సెల్వంని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తున్న కార్లను తెల్లవారుజాము సమయంలో గుర్తించి వారిని రక్షించారు. వివాహం జరిపించిన ఈశ్వరన్, వరుడు సెల్వంకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పోలీస్ స్టేషన్‌ కి తరలించి రక్షణ కల్పించారు. తనిఖీల్లో భాగంగా మరో చెక్‌ పోస్టు వద్ద అమ్మాయి తండ్రి జగన్నాథన్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్ చేసిన ముగ్గురినీ వేర్వేరు కార్లలో తరలించినట్లు తెలుసుకున్న పోలీసులు, వధువు ఇలమది జాడ కోసం ఎంత ప్రయత్నించినా ఆమె తండ్రి జగన్నాథన్ స్పందించలేదని తెలుస్తోంది. తన భార్యకు ప్రాణహాని ఉందని, ఆమెను రక్షించాలని కోరుతూ సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలంపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation