ఈ అమ్మాయి రాసిన లెటర్ చూస్తే కన్నీళ్లు ఆగవు

283

అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు. నాకు బతకాలని ఉంది.. కానీ బతకనివ్వట్లేదు వాడు.. తన గదికి రావాలంటున్నాడు. రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి. ఐలవ్‌యూ అమ్మా. ఐ మిస్‌యూ అమ్మా…చనిపోయే ముందు ఓ యువతి రాసిన లేఖ ఇది. నాకు బతకాలని ఉంది… వాడు బతకనివ్వట్లేదు అని రాసింది చదివితే ఎవరికైనా కన్నీరు వస్తుంది.ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో చోటుచేసుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఓ యువకుడు తనను రూమ్‌కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు… చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. వేధింపులకు కారణమైన ఆ యువకుడు ఎవరు అనేది తెలీదు.
పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల వారు కోరుతున్నారు.“అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉంది.. కానీ వాడు బతకనివ్వట్లేదు.

తన గదికి రావాలంటున్నాడు… రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు.. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి. ఐలవ్‌యూ అమ్మా.. ఐ మిస్‌యూ అమ్మా.. అంటూ”… యువతి ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లికి లేఖ రాసింది. ఎన్ని చట్టాలు వస్తున్నా…అమాయకపు ఆడపిల్లలపై ఈ వేధింపులు మాత్రం ఆగట్లేదు. మానవత్వం మరిచి మృగాళ్లలాగా తయారవుతున్నారు కొందరు.కానీ ఆ అమ్మాయి కూడా ధైర్యం చేసి అతని గురించి కంప్లైంట్ ఇచ్చి ఉంటె బాగుండేది. తొందరపడి ప్రాణాలు తీసుకోకుండా ఉంటె బాగుండు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation