దేవుడు పంపిన దూత.. ముంచేస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం

3104

స్ప్రుష్టి ఎలా ఆవిర్భవించింది అనేది ఎవరికీ తెలీదు. స్పృష్టికి ప్రతి స్ప్రుష్టి అనేది కూడా ఉంది. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు చాలా వింత జీవుల జననాలు జరిగాయి. కొన్నిటి గురించి అయితే సైంటిస్టులకు కూడా అర్థం కావడం లేదు. అలాంటి వింత జీవులను చూసి ఇది దేవుడి స్ప్రుష్టి అని, దేవుడు పంపిన దూతలు వీళ్ళు అని ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి దేవుడు పంపిన దూత గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక్కసారి ఆ విషయానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఆ మధ్య ఆఫ్రికా అడవుల్లో అనకొండ అంత పెద్ద పాము కనిపించింది. అలాగే అర్జెంటీనాలో అతిపెద్ద పక్షి అస్థిపంజరం దొరికింది. ఆ ఆస్థి పంజరం ప్రకారం దాని బరువు 77 కిలోలు. ఆ పక్షి రెక్కలు చాచినప్పుడు 25 అడుగులు ఉంటుందని అంచనా వేశారు సైంటిస్టులు. ఆ పక్షి ఎక్కడి నుంచి వచ్చిందనేది ఎవరికీ తెలీదు. ఇదే కాదు 2015 చైనాలో ఒక విచిత్రమయిన వికారమైన జీవిని కనుగొన్నారు. ఆ జీవి ఒక నగరంలోని రిజర్వాయర్ లో ఈదుతూ కనపడడంతో, వెంటనే అక్కడ పనిచేసేవాళ్ళు దానిని పట్టుకున్నారు. ఆ జీవి చాలా శక్తివంతమైనది. దాంతో ఆ జీవిని ఒక ఇనుప బోనులో బంధించారు. విచిత్రం ఏమిటంటే..ఈ జీవిని కనుగొన్న రిజర్వాయర్ లో చాలా విషపూరిత నీరు ఉంది. అందులోని నీరు ఎందుకు పనికిరాదు. అలాంటి విషపు నీటిలో ఈ జీవి దొరకడం అందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ జీవి ఏ జాతికి చెందినదో కూడా చెప్పలేకపోయారు. ఆ జీవిని ఉంచిన బోనును కొరికి బయటకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించింది. ఈ జీవిని చూసి ఇది భూలోకానికి చెందినది కాదని ప్రచారం చేశారు.

ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. 2015 లోనే థాయిలాండ్ లో ఒక వింత జంతువు కనిపించింది. అయితే అక్కడి ప్రజలు చూసేలోపే ఆ వింత జంతువు ప్రాణాలతో లేదు. అది అచ్చం ఏలియన్ ను పోలి ఉంది. కానీ అది ఏలియన్ అనే సంగతి కూడా వాళ్లకు తెలీదు. ఆ వింత జంతువు రంగు ఆకారం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ జంతువు గురించి విపరీతమైన చర్చ జరిగింది. చివరికి ఆ ఊరి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది దేవుడు పంపిన జంతువు. టెక్నాలజీ మాయలో పడి, పాత విషయాలను మర్చిపోతున్న మనుషులకు, దేవుడు తన ఉనికి చాటిచెప్పాలని ఈ జంతువును మన దగ్గరకు పంపించాడు. ఈ జంతువుకు నివాళులు అర్పిస్తే, భగవంతుడు తమకు మంచి చేస్తాడని నమ్మేశారు అక్కడి జనం. వెంటనే ఆ ఊరి జనం ఆ వింత జంతువును ఊర్లోకి తీసుకొచ్చి సకల మర్యాదలు చేశారు. అగరబత్తులు వెలిగించారు. దండాలు పెట్టుకుని మొక్కుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. ఇక వాసన రాకుండా దానికి కొట్టని అత్తరులు, సెంట్స్ లేనేలేవు.

Image result for దేవుడు పంపిన దూత.

ఇక తర్వాత సైంటిస్టులు వచ్చి, ఆ వింత జీవిని పరిశోధన చేయాలనుకున్నారు. ఆ జంతువూ కుళ్లిపోకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వింత ఘటన ప్రపంచానికి తెలియాలని, ఫోటోలు తీసి మీడియాకు పంపించారు. ఆ జీవిని పరిశీలించినా సైంటిస్టులు, అది ఏ జాతికి చెందినదో చెప్పలేకపోయారు కానీ, అది మాములు జంతువే, దేవుడు పంపిన జంతువు కాదని, ఏదో వ్యాధి వలన ఆ జీవి ఇలా వింత ఆకారంలోకి మారిందని చెప్పారు. కానీ అక్కడి ప్రజలు సైంటిస్టులు చెప్పింది నమ్మలేదు. అయితే ఏ జీవి అనేది తెలుసుకునేందుకు ఇప్పటికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Content above bottom navigation