కలెక్టర్గా ఇంటర్ విద్యార్థిని

1061

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో బాలికలకు ఉన్నత గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఒక్కరోజు అధికారులుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. ఎంపికైన బాలికల్లో గార్లదిన్నె మండలం కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శ్రావణి ఒక్కరోజు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

కలెక్టర్ గంధం చంద్రుడు, సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్తో పాటు ఇతర జిల్లా అధికారులు విద్యార్థిని శ్రావణిని స్వయంగా ఆహ్వానించి, కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. దిశ చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు పరిహారం ఇచ్చే దస్త్రంపై ఒక్కరోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేశారు. ఒక్కరోజు జాయింట్ కలెక్టర్లు(జేసీ)గా మధుశ్రీ, సహస్ర బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో తహసీల్దార్లుగా బాలికలు ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించారు.

జిల్లా కలెక్టర్ మొదలు, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్తో పాటు సమాచార పౌరసంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారుల బాధ్యతలను ఇవాళ బాలికలే చేపట్టారు. కలెక్టరేట్తో పాటు మండల కేంద్రాల్లో బాలికా దినోత్సవాన్ని ఇలా వినూత్నంగా నిర్వహించారు. అధికారులుగా బాధ్యతలు నిర్వహించిన విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని మరింత పట్టుదలతో చదివి ఉన్నతస్థానాలకు చేరేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అక్కడ చదువుతున్న బాలికల పేర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి ఒక్కరోజు అధికార బాధ్యతలు అప్పగించారు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ బాధ్యత కలిగిన పదవుల్లో ఎక్కువగా మహిళలు ఉండటం వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కలెక్టర్ నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం పట్ల మహిళా అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా చదువు మానేస్తున్న బాలికల్లో పట్టుదల పెంచి, లక్ష్యాన్ని చేరుకునేలా ఈ తరహా కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation