పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాలు చెయ్యడానికి కారణం ఇదే.. టార్గెట్ 500 కోట్లు

67

రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. అసలు ఇక సినిమాల వైపే చూడను, తన జీవితం ప్రజల కోసం అంకితం చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. దాంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇక ఆయన్ను వెండితెరపై చూడలేమని తెగ బాధపడిపోయారు. కానీ దేవుడు అభిమానుల బాధ అర్థం చేసుకున్నట్లు ఉన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీ అయిపోయారు. ఇక సినిమాలే చేయను అన్న ఆయన వరుస పెట్టి చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయట. అసలు పవన్ వరుస పెట్టి ఇన్ని సినిమాలు చేసుకుంటూపోవడానికి వెనక బలమైన కారణం ఉంది.

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు కానీ మహా అయితే ఏడాదికి ఒక్కటే సినిమా చేస్తారని అనుకున్నారంతా. కానీ ఆయన వరుస పెట్టి సినిమాలకు సంతకాలు చేసుకుంటూ పోతుండడంతో ఫ్యాన్స్ కూడా షాక్‌ లో ఉన్నారు. ప్రస్తుతం పవన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పింక్’ తెలుగు రీమేక్‌ లో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. సెట్స్‌కు పవన్.. నిర్మాత దిల్‌రాజు ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్‌ లో వచ్చి మరీ వెళ్తున్నారు. ‘పింక్’ రీమేక్‌ తో పాటు క్రిష్ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు పవన్. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ కన్‌ఫర్మ్ చేశారు.. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ ను ఎంపిక చేసుకున్నారట. ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ కు ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్‌ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Image result for pavan kalyan

ఈ మూడు సినిమాలే కాకుండా దర్శకుడు డాలీతో కలిసి సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ సినిమాను నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. పవన్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఎన్నికల సమయంలో డాలీ పవన్‌ కు తనవంతు సాయం చేసాడు. ఆ స్నేహభావంతోనే పవన్ అతనితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. వీటన్నింటితో పాటు హారిక హాసిని క్రియేషన్స్‌ తో ఓ సినిమా, దిల్ రాజుతో కలిసి మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పుడు ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేస్తారు అని చాలామంది డౌట్ పడుతున్నారు. అయితే పవన్ ఈ సినిమాలన్నీ చేసేది తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమేనట. వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీకి రూ.500 కోట్లు కావాలి. పవన్ లాంటి సత్తా ఉన్న హీరోకి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇచ్చి సినిమా చేయించుకునే నిర్మాతలు చాలా మంది ఉన్నారు. అందుకే సినిమాలతో ఆ రూ.500 కోట్లు సంపాదించి వచ్చే ఎన్నికల కోసం వినియోగించాలని పవన్ ప్లాన్ వేసారట. పవన్ ప్రతీ సినిమాకు ఎంతకాదన్నా రూ.50 కోట్లు పారితోషికంగా తీసుకుంటారు. అలా చూసుకుంటే ఆల్రెడీ పవన్ అకౌంట్‌ లోకి రూ.300 కోట్లు వచ్చినట్లే. ఉదయం స్పెషల్ ఫ్లైట్‌ లో షూటింగ్స్‌ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్, సాయంత్రానికల్లా పార్టీ పనులు చూసుకోవడానికి అమరావతి వెళ్లిపోతున్నారు. మొత్తానికి పవన్ రాజకీయ, సినీ కెరీర్‌ ను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు.

Content above bottom navigation