నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న టీచర్.. పోలీసులకే దిమ్మ తిరిగింది

అతను ఒక ప్రభుత్వ టీచర్. పిల్లలకు నాలుగు నీతి మాటలు చెప్పి, వారికి ఉన్నత భవిష్యత్ అందించాలి. కానీ అతనే నీతి తప్పి ప్రవర్తించాడు. మహిళల మీద ఉన్న మోజులో ఒకరిని కాదు ఇద్దరినీ కాదు ఏకంగా నలుగురు మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పేద కుటుంబాలకు చెందిన యువతులకు మాయమాటలు చెప్పి వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రెండో భార్య స్పందన కార్యక్రమంలో నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు గుట్టు మొత్తం బయటపడగా, ఈయన పెళ్లిళ్ల కథ మొత్తం విని పోలీసులకు దిమ్మ తిరిగింది. పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియోని చూడండి

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు సమీపంలోని సౌత్‌ వల్లూరుకు చెందిన మహమ్మద్‌ బాజీ అదే ఊరిలో మండల పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ గా పనిచేస్తున్నాడు. అతడికి గతంలోనే వివాహం కాగా, మళ్లీ తెనాలిలోని మారీసుపేటకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. తనకు గతంలోనే వివాహం జరిగి మొదటి భార్య చనిపోయిందని నమ్మించి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు.. మొదటి రెండు నెలలు ఆమెను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. తర్వాత వేరు కాపురం పెడతామని చెప్పి విజయవాడలో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ప్రతి ఆదివారం వచ్చి వెళుతుండేవాడు.. మెల్లిగా మొహం చాటేశాడు. దీంతో బాధితురాలికి బాజీ తీరుపై అనుమానం వచ్చింది. ఆమె భర్త గురించి ఆరా తీయగా, నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మూడో పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని తేలింది. దీనిపై రెండో భార్య నిలదీయగా, ఆమెను తిట్టి కొట్టడంతో గర్భస్రావం కావడంతో ఆస్పత్రిలో వదిలేసి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ నెలకోసారి వచ్చి వెళ్లేవాడు. బాజీ తీరును గమనించి రెండో భార్య కుటుంబ సభ్యులు, పెద్దలు గట్టిగా నిలదీయడంతో ఆస్తి రాస్తానని, పద్దతి మార్చుకుంటానని నమ్మబలికాడు. ముందు రెండు పెళ్లిళ్ల వ్యవహారం మూడో భార్యకు తెలియడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. రెండో భార్యకు విడాకులు ఇస్తేనే కాపురానికి వస్తానని ఆమె పట్టుబట్టింది.

Image result for నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న టీచర్

ఆ మూడు పెళ్లిళ్ల సంగతి అలా ఉంటే.. కొద్ది నెలల క్రితం దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ళ బాలికను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఉంగరం, రూ.30 వేలు ఇచ్చి వివాహం చేసుకున్నాడు.. కొద్ది రోజులకు బాలికను కూడా వదిలేశాడు. సీన్ కట్ చేస్తే.. బాజీ రెండో భార్య దగ్గరకు మళ్లీ వచ్చాడు. విజయవాడలోని వాంబే కాలనీలో ఇల్లు కొన్నానని చెప్పి నకిలీ డాక్యుమెంట్లు చూపించాడు. మరో పెళ్లి చేసుకోమని ఆమెకు చెప్పాడు. పెళ్లికి అవసరమైతే రూ.లక్ష కట్నం ఇస్తానని నమ్మబలికాడు. తర్వాత ఇంటి డాక్యుమెంట్లను పరిశీలిస్తే అవి నకిలీవని తేలింది. ఇలా వరుసగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని రెండో భార్యకు తెలియడం, బాజీ మొదటి భార్య బతికే ఉందని, అతడి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. దీంతో ఆమె స్పందన కార్యక్రమంలో గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని తెనాలి డీఎస్పీని ఆదేశించారు. చూశారుగా సమాజంలో ఉన్నతంగా బతకాల్సిన టీచర్ దారి తప్పి అమ్మాయిలను ఎలా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడో.. ఇతనికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టో మీరే చెప్పండి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation