చంద్రబాబు పీఏకి ఐటీ అధికారులు షాక్, సోదాల్లో కోట్ల రూపాయ‌ల ఆస్తులు

ఏపీలో తెలంగాణ‌లో ఐటీ అధికారుల దాడులు జరుగుతున్న సంగ‌తి తెలిసిందే, తాజాగా ఏపీలో ఓ వ్యక్తి ఇంట ఐటీ దాడులు ప‌లు వార్త‌ల‌కు కార‌ణం అవుతున్నాయి.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వద్ద పీఏగా పనిచేశారు శ్రీనివాస్ అనే వ్య‌క్తి. ఇప్పుడు అదే శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేశారు ఈ వార్త పెను వైరల్ అవుతోంది.విజయవాడతో పాటు హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఉన్న ఆయన నివాసం, ఆఫీసులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ తనిఖీల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆయ‌న గ‌తంలో బాబు ద‌గ్గ‌ర పీఏగా ప‌ని చేయ‌డంతో ఇప్పుడు ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గా సాగుతోంది.

Image result for chandra babu

శ్రీనివాస్ సెక్రటేరియట్ లో ఉద్యోగి. గత ఏడాది వరకు ఆయన చంద్రబాబు ద‌గ్గ‌ర‌ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆ కాలంలో ఆయన భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో, ఈ అభియోగాలు-ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్టయింది. విజయవాడ, హైదరాబాద్ లో శ్రీనివాస్ కు పలు ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. మరోవైపు రకరకాల పేర్లతో ఆయన పలు కంపెనీలు కూడా స్థాపించినట్టు తెలుస్తోంది. ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని ప్రాధమికంగా నిర్థారించారు ఐటీ ఆఫీసర్లు.

ఈ క్రింది వీడియోని చూడండి

సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి, చంద్రబాబు ద‌గ్గ‌ర సహాయకుడిగా మారిన వెంటనే వందల కోట్ల రూపాయలకు అధిపతిగా మారడంతో అంతా అవాక్కయ్యారు. రేపటి కల్లా శ్రీనివాస్ కు ఐటీ నోటీసులు అందిస్తామంటున్నారు అధికారులు. అప్పుడు అసలైన ఎమౌంట్ బయటకొచ్చే అవకాశం ఉంది. మ‌రి చూడాలి అస‌లు ఈ సోదాల్లో ఎంత సొమ్ము బ‌య‌ట‌ప‌డుతుందో.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation