దెయ్యాల దీవి : ఈ దీవిలోకి ఒంటరిగా వెళ్తే మరణమే.. దెయ్యాలు చంపుతాయంట?

దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి చాలా మంది పరిశోదనలు చేస్తూనే వస్తున్నారు.. అసలు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి.. నిజంగానే సినిమాల్లో చూపించినట్లు దెయ్యాలు రక్తాన్ని తాగుతాయా..మనుషులను హింసిస్తాయా.. అనే విషయాల గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..అలా ఒక దీవిలో దెయ్యలు ఉన్నాయనే వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దీవిగా పేరొందిన ఆ ఐలాండ్‌లో ఇప్పుడు ఒక్కరు కూడా నివసించడం లేదు. కారణం దెయ్యాలు. మరి నిజంగానే ఆ దీవిలో దెయ్యాలు ఉన్నాయా.. దాని వెనుక ఉన్న కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for hashima island

ఆ దీవి పేరు హషిమా ఐలాండ్. జపాన్‌లో అత్యధిక పర్యాటకులు సందర్శించే ప్రాంతం. నాగసాకి నుంచి ఒక గంటసేపు ప్రయాణిస్తే ఈ దీవికి చేరుకోవచ్చు. ఘోస్ట్ టౌన్‌గా పేరొందిన ఈ దీవిని గుంకంజిమా అని కూడా పిలుస్తారు. యుద్ధ నౌక రూపంలో ఉండే ఈ దీవిని ‘బ్యాటిల్‌షిప్ ఐలాండ్’ అని కూడా అంటారు. ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించదు. బృందాలుగా వెళ్లేందుకు మాత్రమే టూరిస్ట్ ఆపరేటర్‌కు షరుతులతో కూడిన అనుమతి ఇస్తారు. ఇక ఈ దీవి వెనుక ఉన్న చరిత్రలోకి తొంగి చూస్తే ఈ దీవి వెనుక ఓ బుల్లి సైజు ‘కేజీఎఫ్’ కథ దాగి ఉంది. సాధారణంగా సముద్రం మధ్యలో ఉండే దీవుల్లో గనులు ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన దీవుల్లో హషిమా ఐలాండ్ ఒకటి. ఇక్కడ బొగ్గు వనరులు పుష్కలంగా ఉండటంతో మిత్సుబిషీ కార్పొరేషన్ 1890లో ఈ దీవిని కొనుగోలు చేసి మైనింగ్ ప్రారంభించింది. 1895 నుంచి 1898 వరకు ఈ దీవిలో 199 మీటర్ల లోతు వరకు బొగ్గు గనులను తవ్వారు. అనంతరం మైనింగ్ పనుల కోసం ఆ సంస్థ కూలీలను, వారి కుటుంబాలను ఈ దీవికి తరలించింది. ఇలా సుమారు మూడువేల మంది ఆ దీవికి చేరుకున్నారు. వారి కోసం సంస్థ అక్కడే అపార్టుమెంట్ల రూపంలో భవనాలు నిర్మించి, వసతి కల్పించింది. ఆ భవనాల్లో కుటుంబానికి ఒక గది మాత్రమే కేటాయించడంతో కూలీలు దుర్భర జీవితాన్ని గడిపేవారు. వారంతా దాదాపు జైలు జీవితం అనుభవించారు.

Image result for hashima island

1959లో ఇక్కడి జనాభా 5,259 కి చేరింది. 12 ఫుట్‌బాల్ మైదానాలంత సైజులో ఉండే ఈ దీవిలో దాదాపు 30 కాంక్రిట్ భవనాలు ఉన్నాయి. రిటైల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు, బార్, రెస్టారెంట్లు, స్కూల్, హాస్పిటల్, లైబ్రరీ, జిమ్, హెయిర్ డ్రస్సర్, సినిమా థియేటర్, ఆలయాలు, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు ఉండేవి. అయితే, అవన్నీ ఇప్పుడు శిథిలమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ బంధించిన 41 వేల మంది యుద్ధ ఖైదీల్లో 3,765 మందిని ఇక్కడికి తరలించారు. వారితో బలవంతంగా మైనింగ్ పనులు చేయించేవారు. వారికి ఆహారం కూడా పెట్టేవారు కాదు. పనిచేయపోతే హింసించేవారు. దీంతో వారంతా అస్థిపంజరాల్లా మారారు. చాలామంది ఆ గనుల్లోనే ప్రాణాలు విడిచేవారు. ఇక్కడ మైనింగ్‌లో చనిపోయిన కూలీలు, యుద్ధ ఖైదీలను పాతిపెట్టేందుకు స్థలం సరిపోయేది కాదు. దీంతో శవాలను దహనం చేసేందుకు క్రిమాటోరియంను ఏర్పాటుచేశారు. అక్కడ రోజూ పదుల సంఖ్యలో శవాలను దహనం చేసేవారు. ఆ కొలిమి నుంచి నిత్యం పొగలు వస్తూనే ఉండేవంటే మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే, 1945లో నాగసాకిలో అణుబాంబు దాడి తర్వాత అక్కడ బందీలైన కూలీలు, యుద్ధ ఖైదీలకు విముక్తి లభించింది. ఈ దీవి నుంచి విముక్తి లభించిన సన్ జుగ్వా అనే కూలీ తెలిపిన వివరాల ప్రకారం.. అక్కడ తమని బానిసలా చూసేవారని, 14 ఏళ్ల వయస్సు నుంచే ఆ పనులకు తరలించేవారని తెలిపాడు. యుద్ధం ముగిసిన తర్వాత 1,442 మంది కొరియా కూలీలను, 722 చైనా కూలీలను చనిపోయే వరకు హింసిచారని తెలిపాడు. ఆ దీవి నుంచి తప్పించుకోడానికి కూలీలు సముద్రంలోకి దూకేవారని, దాన్ని ఈదలేక మధ్యలోనే ప్రాణాలు విడిచేవారని, కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడేవారని జుగ్వా పేర్కొన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

ఇక ఇప్పుడు ఈ దీవికి ఒంటరిగా వెళ్లిన వారు చనిపోతున్నారు. వారిని దెయ్యాలే చంపేశాయని కొందరు వాదిస్తుంటే, మరికొందరు సముద్రంలో మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే, వారంతా ఏమయ్యారనేది ఇప్పటికీ మిస్టరీనే. ఈ దీవిలో అడుగుపెట్టే పర్యటకులు శిథిల స్థితిలో ఉన్న భవనాలు భయకంపితులను చేస్తున్నాయి. ఆ నిశబ్ద దీవిలో వింతైన ఆర్తనాదాలు తమ చెవుల్లో మార్మోగుతున్నాయని పర్యాటకులు తెలుపుతున్నారు. తమని వెనుక నుంచి వచ్చి ఎవరో తాకిన అనుభవం కలిగేదని, ఆ దీవిలో దెయ్యాలు నివసిస్తున్నాయనే సమాచారం ముమ్మాటికీ నిజమని చెబుతున్నారు. అప్పట్లో చనిపోయినవారి ప్రేతాత్మలతో ఆ దీవి నిండిపోయిందని, అక్కడ నివసించకపోవడమే ఉత్తమం అని అంటున్నారు. అయితే, జపాన్ ప్రభుత్వం ఈ దీవికి పూర్వ రూపం తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. జేమ్స్‌బాండ్ సినిమా ‘స్కైఫాల్’ లో కొన్ని సన్నివేశాలను ఈ దీవిలోనే చిత్రీకరించారు. ఇలా ఈ దీవి దెయ్యాల దేవిగా పేరు పొందింది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation