కల్నల్ సంతోష్ బాబు రియల్ స్టోరీ

199

భారత్ – చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారతీయ ఆర్మీ చైనా ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా కాల్పులకు తెగబడింది. చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి.

ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. క‌ల్న‌ల్ సురేష్‌ ల‌డ‌ఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ ద‌ళానికి క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఇక దేశం కోసం పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోష్‌ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. నేడు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు పార్థీవదేహం హైదరాబాద్ చేరుకుంటుంది.

హకీమ్ పెట్ ఎయిర్పోర్ట్ కు ఆయన భౌతికాయం చేరుకోగానే అధికారులు గౌరవ వందనం ఇవ్వనున్నారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన మృతదేహాన్ని సూర్యాపేటకు తరలిస్తారు. అనంతరం సూర్యపేట జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు రేపు(గురువారం) నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటికే ఆర్మీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

Content above bottom navigation