ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!

పంజాబ్‌లో ఓ కరోనా పేషెంట్ ఆసుపత్రి నుంచి పారిపోయాడు. మంగళవారం దుబాయ్ నుండి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో చెకప్ నిమిత్తం మోగాలోని ఓ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి డాక్టర్లు అతనికి పలు పరీక్షలు జరిపి కరోనా వైరస్ ఉన్నట్లు అనుమానించి ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించారు. దీనితో ఆ పేషెంట్ భయపడి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కొన్ని గంటల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి పూర్తి శాంపిల్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ విషయంపై ఆ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఓ డాక్టర్ మాట్లాడుతూ ‘ కొందరు మీడియా వ్యక్తులు అతడ్ని ఫోటోలు తీయడంతో ఐసోలేషన్ వార్డులో చేరేందుకు మొదట్లో నిరాకరించాడు. అప్పుడు కొంతమంది వైద్యులు, స్థానిక పోలీసులతో కలిసి అతని ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఒప్పించడంతో ఆ వ్యక్తి మళ్ళీ ఆసుపత్రికి తిరిగి వచ్చి మిగతా శాంపిల్స్ ఇవ్వడమే కాకుండా అడ్మిట్ కావడానికి కూడా అంగీకారం తెలిపాడు. కాగా, అతని నమూనాల్లో న్యుమోనియా లక్షణాలు ఉన్నట్లు తేలింది. కరోనా వైరస్ పరీక్ష కోసం అతని శాంపిల్స్‌ను పూణే ల్యాబ్‌కు పంపించాం. రెండు రోజుల్లో రిపోర్టులు రావాల్సి ఉన్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation