తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గొప్ప శుభవార్త చెప్పారు. భూ సమస్యల కోసం ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. కొత్త చట్టం వివరాలను వెల్లడించారు. ఈ చట్ట ప్రకారం తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు.
ప్రతి సర్వే నెంబర్కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తారని వెల్లడించారు. ఈ చట్టం వచ్చాక భూమి కోసం ఎవరూ గొడవ పడే ఘటనలు ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.