అన్ లాక్ 1.0 తెలంగాణలో వీటికి మాత్రమే అనుమతి… రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న కరోనా మరణాలు…?

100

దేశంలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజూ 10,000 కేసులు నమోదవుతూ ఉండగా కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు సడలించటంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు సర్వేల్లో జూన్ 15వ తేదీ నుంచి భారత్ లో ప్రతిరోజూ 15,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తేలింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 200కు అటూఇటుగా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

తెలంగాణ సర్కార్ కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 8 నుంచి అన్ లాక్ 1.0లో అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన జీవోను నిన్న విడుదల చేసింది. రాష్ట్రంలో కేసులు నమోదైన కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని పేర్కొంది. అన్ లాక్ 1.0 లో కంటైన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఇప్పటివరకు నిషేధించినవన్నీ తెరచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్రం తాజా సడలింపుల ప్రకారం రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలు, ఆలయాలు నేటి నుంచి తెరచుకోనున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, ఆతిథ్య సేవా సంస్థలు కూడా నేడి నుంచి సేవలు అందించనున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలో షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కూడా అనుమతులు ఇచ్చింది. అయితే థియేటర్లు, గేమింగ్ పార్కులపై మాత్రం నిషేధం కొనసాగుతోంది. ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా మరణమృదంగం వాయిస్తోంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా రోగులు మృతి చెందుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 154 కరోనా కేసులు నమోదు కాగా 14 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఒకేరోజు 14 మంది మృతి చెందడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,650 కరోనా కేసులు నమోదు కాగా 137 మంది ఇప్పటివరకు మృతి చెందారు.

Content above bottom navigation