తెలంగాణలో మే 21 వరకూ లాక్ డౌన్.. రేపు కేసిఆర్ ప్రకటన?

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఉపయోగిస్తున్న ఏకైక ఆయుధం లాక్ డౌన్. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం Lock Down 3.0 జరుగుతోంది. 2020, మే 03వ తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని సడలింపులు ఇచ్చాయి.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

అయితే..ఇక్కడ అందరి చూపు తెలంగాణ రాష్ట్రంపై నెలకొంది. ఎందుకంటే..కేంద్రం విధించిన గడువుకన్నా ఎక్కువ రోజులు పొడిగిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకుని మే 03వ తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2020, మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే..మరలా లాక్ డౌన్ ను పొడిగిస్తారా ? లేదా ? అనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దీనిని పొడిగించే సూచనలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఇదే విధంగా కోరుతున్నట్లుగా ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు టాక్. 

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో 2020, మే 21వ తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్ డౌన్ పొడిగింపు..తదితర అంశాలపై 2020, మే 03వ తేదీ ఆదివారం సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన క్రమంలో మరో రెండు వారాల పాటు కొనసాగించాలని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. కంటైన్మెంట్‌ జోన్లలో క్వారంటైన్‌ గడువు ఈ నెల 21న ముగియనుంది. దీనిని పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. 

ఇక చర్చల్లో లాక్ డౌన్ పొడిగింపు క్రమంలో ఇచ్చిన సడలింపుల విషయంపై చర్చించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో ఎంతమేర అమలు చేయవచ్చనే దానిపై చర్చించారని టాక్. వలస కార్మికుల తరలింపు విషయంలో మొదట కేంద్రం తీసుకున్న నిర్ణయం..తర్వాత చేసిన ప్రకటనతో అనుసరించాల్సిన చర్యలపై చర్చించారు. ఇక గ్రీన్ జోన్లలో తక్కువ సంఖ్యలో ప్రజా రవాణా మద్యం విక్రయాలకు అనుమతించిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 

2020, మే 05వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంపై అందరి దృష్టి నెలకొంది. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేయాలని..ఇందుకు మే 04వ తేదీ సోమవారం మరోసారి సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. లాక్‌డౌన్‌ పొడిగింపు, ఏయే రంగాలకు సడలింపు ఇవ్వాలి ? తదితర అంశాలు, పాటించాల్సిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి మరి. 

Content above bottom navigation