రాత్రికి రాత్రే కేరళ కూలీకి రూ. 12కోట్లు..!

1012

అదృష్టం దురదృష్టం అనేవి ఎప్పుడు వస్తాయో ఎటునుంచి వస్తాయో ఎవరికీ తెలియదు.ఆ రెండు చెప్పి రావు.అదృష్టం వస్తే బీదవాడిగా ఉన్నవాడు ఉన్నట్టుండి కోటీశ్వరుడు అవుతాడు. అదే దురదృష్టం వస్తే కోటీశ్వరుడిగా ఉన్నవాడు ఉన్నట్టుండి బిచ్చగాడిలా మారుతాడు. ఇలా మారినవారిని మనం చాలా మందిని చూసాం కూడా. ఇప్పుడు ఇలాగే అదృష్టం వరించి కూలి పనులు చేసుకునేవారు కాస్త కోటీశ్వరులు అయ్యారు. ఊహించని విధంగా వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. తినడానికి తిండి కోసమే ఎంతో కష్టపడే వారు ఒక్కసారిగా కోట్ల రూపాయలను కళ్ల చూసే పరిస్థితి వచ్చింది. మరి ఆ కూలి ఎలా కోటీశ్వరులు అయ్యారో చూద్దామా.

Kerala Labourer Wins Rs 12 Crore Lottery - Sakshi

కేరళ రాష్ట్రం కన్నూరు జిల్లాలో చోటుచేసుకుంది. పేరూన్నోన్‌ రాజన్‌ అనే వ్యక్తి రోజూవారీ కూలీ పనులకు వెళ్తూ జీవనాన్ని సాగించేవాడు. రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితి అతని కుటుంబానిది. అప్పులపాలైన అతడు చాలీచాలని కూలీ డబ్బులతోనే తన కుటుంబాన్ని నెట్టుకొస్తుండేవాడు. అతడి భార్య రజనీ స్థానిక అంగన్‌వాడీలో తాత్కాలిక సిబ్బందిగా పనిచేస్తోంది. రాజన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే తాను పడుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఏ రోజైనా అదృష్టం తలుపు తట్టదా అనే ఆశతో రోజూ లాటరీ టికెట్లు కొంటుండేవాడు. అలా తాజాగా రాజన్ కొన్న లాటరీ టికెట్టుకు కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీ పేరిట రూ.12కోట్లు దక్కాయి. తనకు బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడు గెలిచిన ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటీవ్ బ్యాంకు వద్దకు వెళ్లి అధికారికంగా అందజేశాడు. ఇప్పటికే ఆ బ్యాంకులో ఇంటిపై అతను అప్పు చేశాడు. ప్రైజ్ మనీ రాగానే ముందుగా ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పారు. తన చిన్న కూతురిని బాగా చదివించాలని చూస్తున్నట్లు చెప్పారు.

ఈ క్రింది వీడియోని చూడండి

రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో తనకు గతంలో సహాయపడిన వారికి సాయం చేస్తానని రాజన్ చెప్పారు. చెమట చిందించి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని రాజన్ వివరించారు. రాజన్‌కు భార్య రజని, ఇద్దరు కుమార్తెలు అక్షర, అథిర, కుమారుడు రిగిల్ ఉన్నారు. చూశారుగా అదృష్టం వరించి రాత్రికి రాత్రి ఎలా కోటీశ్వరుడు అయ్యాడో. కేరళ రాష్ట్రం లాటరీ టికెట్ అమ్మకాలకు కూడా తెగ ఫేమస్. ఇక్కడ లాటరీ టికెట్లు అమ్మకాలు, కొనుగోలు చట్టపరంగానే జరుగుతాయి. కేరళ లాటరీ టికెట్లు కొని చాలామంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన ఘటనలు చాలా చూశాం. కొన్నేళ్ల క్రితం అనంతపురం నుంచి కేరళకు వలస వెళ్లి భిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి లాటరీ టికెట్ కొని కోటీశ్వరుడయ్యాడు. ఇప్పుడు ఈయన అయ్యాడు. మరి మీకు కూడా అదృష్టం వరించాలంటే కేరళ వెళ్లి లాటరీ కొనుక్కోండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation