బిగ్ బ్రేకింగ్ జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాకిచ్చిన కియా మోటర్స్

236

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల ఏపీకి రావలసిన పెట్టుబడులు అన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి అనేలా తెలుగుదేశం పార్టీ అలాగే కొన్ని మీడియా సంస్ధలు ప్రచారం చేస్తున్నాయి, అయితే ఇది అవాస్తవం అని వైసీపీ చెబుతోంది.. కావాలనే పరిపాలనపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. అసలు విషయం చూస్తే.. ఏపీ రాజకీయవర్గాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా జగన్ పరిపాలనపై ఈ వార్త సంచలనం రేపుతుందో…జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడిదారులు ఎవరూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రావడం లేదని.. గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి మనం వింటూనే ఉన్నాము.ఇదే అనుకుంటే చంద్రబాబు హయాంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రంలో మొదలైన భారీ ప్రాజెక్ట్ కియా మోటర్స్. ప్రపంచంలోని అతి పెద్ద కార్ మార్కెట్ ఉన్న ఈ సంస్థకు చెందిన ఐదవ అతి ప్లాంట్ ను అనంతపురం జిల్లాలో నెలకొల్పారు.

Image result for jagan

దీనితో రాష్ట్ర ప్రజలకు సహా రాష్ట్రానికి మంచి గుర్తింపు రావడంతో పాటుగా అభివృద్ధి కూడా వేగంగా పెరుగుతుంది అనుకుంటే ఇప్పుడొక మైండ్ బ్లోయింగ్ వార్త బయటకు వచ్చింది.ప్రపంచంలోనే నెంబర్ 1 న్యూస్ ఏజెన్సీ అయినటువంటి రాయిటర్స్ వారు రాసిన కథనాల ప్రకారం. ఇప్పటికే ఏపీలో ప్రారంభం చేసిన కియా మోటర్స్ వారు జగన్ పాలన నిమిత్తం, వారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని రాయిటర్స్ వార్త తెలిపింది.అందుకే ఇప్పటికే నెలకొల్పిన ప్లాంటును కాస్త తమిళనాడుకు తరలించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారని వారు తెలిపారు…దీనితో ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే ఈ వార్తలని వైసీపీ ఖండించింది. అంతేకాదు కియా కూడా దీనిపై ప్రకటన చేసింది.ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్‌ను తరలించాలన్న ఆలోచన తమకు లేదని కియా మోటార్స్‌ ప్రకటించింది. ఏపీలో ఉన్న 110 కోట్ల డాలర్ల విలువైన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించే ఆలోచనలో కియా మోటార్స్‌ ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌ రాసిన కథనాన్ని సంస్థ ఖండించింది.

ఈ క్రింది వీడియోని చూడండి

ఈ కథనం చూసి ఆశ్చర్యపోయాం. ఇది అత్యంత చెత్త ఊహాగానం. ఏపీలో మా ప్లాంట్‌ అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు రావడం ఆశ్చర్యం కలిగించింది అని కియా మోటార్స్‌ ఇండియా హెడ్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) మనోహర్‌ భట్‌ ఓ ఆంగ్ల మీడియాతో అన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ కథనాన్ని ఖండించింది. ఈ కథనం పూర్తిగా అవాస్తవమని పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్‌ తెలిపారు. మొత్తానికి ఇలాంటి అసత్య వార్తలు రాసే వారిపై కచ్చితంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి అని ఏపీ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation