లెజెండరీ నటుడు కన్నుమూత షాక్ లో సినీ పరిశ్రమ

19530

కిర్క్‌ డగ్లస్ ఈ పేరు తెలియని వారు ఉండరు.హాలీవుడ్ లో ఆయనక ఓ విలక్షణ నటుడు. కిర్క్‌ డగ్లస్‌.. సినీ ప్రేమికులకు ఇతను ఓ ఆరాధ్యుడు తన అసమాన ప్రతిభతో హాలీవుడ్‌ను శాసించి సంచలనాలకు మారుపేరుగా నిలిచిన లెజండరీ యాక్టర్‌ కిర్క్‌ డగ్లస్‌ బుధవారం కన్నుమూశారు. 103 సంవత్సరాల వయస్సులో మమ్మల్ని విడిచిపెట్టినట్లు నేను ప్రకటించడం చాలా విచారంగా ఉందని ఆయన కుమారుడు మైఖేల్ డగ్లస్ ఈ విషాదవార‍్తను ప్రపంచానికి తెలియజేశారు.

Image result for కిర్క్‌ డగ్లస్

ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ఒక నటుడుగా, అంతకుమించిన మానవతావాదిగా నిండైన జీవితాన్ని జీవించారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నానంటూ తన తండ్రికి మైఖేల్‌ నివాళుర్పించారు. నటుడు దర్శకుడు రాబ్ రైనర్ స్పందిస్తూ హాలీవుడ్ పాంథియోన్‌లో ఆయనొక చిహ్నంగా సదా నిలిచి వుంటాడని ట్వీట్‌ చేశారు. సహజ నటనతో ప్రేక్షకుల్న మంత్రముగ్ధుల్ని చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని హాలీవుడ్ పెద్దలు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

Kirk Douglas

1916లో అమ్‌స్టర్‌డామ్‌లోని డానిలోవిచ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించారు కిర్క్‌ డగ్లస్‌. అనేక ఒడిదుడకులను ఎదుర్కొన్నారు.. ఆయన జీవితం డైనా డిల్‌తో పెళ్లితో కీలక మలుపు తిప్పింది. పెళ్ళి తర్వాత థియేటర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తూ.. అంచలంచెలుగా ఎదిగారు. ఏడు దశాబ్దాలుగా సాగిన కెరీర్‌లో డగ్లస్ 90 కి పైగా సినిమాల్లో నటించారు. ఇన్నేండ్ల సినీ పయనంలో ఒక దశాబ్దం (1950-60) పాటు హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన ఘనుడు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తానేమిటో నిరూపించుకుని ప్రపంచ సినీ ప్రేక్షకులతో శభాష్‌ అనిపించుకున్న ఆల్‌రౌండర్‌ కిర్క్‌ డగ్లస్‌.

ఈ క్రింది వీడియోని చూడండి

‘స్పార్టకస్’, ‘ది వైకింగ్స్’ వంటి చిత్రాలు 1950, 60 లలో బాక్సాఫీస్ భారీ విజయాలను సాధించాయి. ఇంకా ‘‘యాస్‌ ఇన్‌ ద హోల్‌’, ‘డిటెక్టివ్‌ స్టోరీ’, ‘లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌’, ‘సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే’, ‘పాత్‌ ఆఫ్‌ గ్లోరీ’, ‘గన్‌ఫైట్‌ ఎట్‌ ద ఓ.కె. కోర్రల్‌’, ‘ద హీరోస్‌ ఆఫ్‌ టెల్‌మార్క్‌’, ‘సటర్న్‌ 3’, ‘స్నో రివర్‌’, ‘టఫ్‌ గైర్సు’, ‘ద విలన్‌’, ‘ద ఫ్యూరీ’, ‘గ్రీడీ’, ‘ఆస్కార్‌’, ‘డ్రా’, ‘ఏ సెంచరీ ఆఫ్‌ సినిమా’, ‘డైమండ్స్‌’ వంటివి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలుగా నిలిచాయి. ఆయనకు హాలీవుడ్ నటులు నివాళి అర్పించారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation