మీకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉందా? ఈ అకౌంట్‌తో వచ్చే లాభాల గురించి మీకు తెలుసా? భారతదేశంలో పౌరులందరికీ, కుటుంబంలో కనీసం ఒకరికైనా బ్యాంకు అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది.
ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా పౌరులకు జన్ ధన్ ఖాతాలున్నాయి. కనీస బ్యాలెన్స్ అవసరం లేకపోవడం, రుపే డెబిట్ కార్డ్, రూ.1 లక్ష వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభించడం ఈ స్కీమ్‌లోని హైలైట్స్.
ఇది కూడా చదవండి: నా భార్య అందుకే నన్ను వదిలేసింది . కారణం చెప్పి షాక్ ఇచ్చిన సూర్య కిరణ్
ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ మాత్రమే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే దీంతో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది. అయితే జీవిత బీమా కవరేజీ అందరికి లభించదు. కొందరు మాత్రమే ఈ కవరేజీ పొందొచ్చు.