వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈ మధ్య వివాహాలు చాలా వెరైటీగా జరుగుతున్నాయి.లింగ భేదం ఏమీ మాకు అవసరం లేదు అని చెబుతున్నాయి కొన్ని ప్రేమ జంటలు. అమ్మాయి – అబ్బాయి పెళ్లి చేసుకోవడం ఓల్డ్ ట్రెండ్.ఇప్పుడు అమ్మాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.అబ్బాయి మరో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నయా ట్రెండ్.ఇలా చాలా మంది వివాహాలు చేసుకుని ఒకటవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.లేడీ కానిస్టేబుల్ ఓ యువతిపై మనసు పడింది. ఆమెనే వివాహం చేసుకోవాలని అనుకుంది. కానీ ఇద్దరు స్త్రీలే కావడంతో. వారి వివాహానికి ఇబ్బందులు వచ్చాయి. ఏం చేయాలనే ఆలోచన చేస్తుండగానే..

లేడీ కానిస్టేబుల్ కు లింగ మార్పిడి చేసుసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఏది ఏమైనా మనస్సు పడిన యువతినే వివాహం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉండటంతో లేడీ కానిస్టేబుల్ లింగ మార్పిడి చేసుకొని పురుషుడిగా మారిపోయి యువతిని వివాహం చేసుకున్నాడు.లింగ మార్పిడి చేయించుకున్న లేడీ కానిస్టేబుల్ బేరు లలిత్ అలియాస్ లలిత్ సాల్వే. నాలుగేళ్ళ క్రితం లలితా కుమారి సాల్వే తాను శరీరంలో మార్పులను గమనించింది. దాంతో లింగ మార్పిడి చేసుకోవాలని డిసైడ్ అయింది. కానీ అందుకు ఉద్యోగ రీత్య ఇబ్బందులు వచ్చాయి. లింగ మార్పిడి చేసుకొనేందుకుగాను ఉన్నతాధికారుల అనుమతి కోరినా నిరాకరించారు. ఇక లాభం లేదనుకొని బాంబే హైకోర్టును ఆశ్రయించింది.ఇందుకోసం రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను సంప్రదించాలని సాల్వేకు హైకోర్టు సూచించింది.
ఈ క్రింది వీడియో చుడండి
లలితకు లింగమార్పిడి చేసుకునేందుకు అనుమతినిస్తూ హోంశాఖ సెలవు మంజూరు చేసింది. దీంతో ఆమె ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించింది.2018లో లలిత ముంబైలోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో లింగ మార్పిడి చికిత్స చేసుకొని.. లలితా కుమారి సాల్వే కాస్తా లలిత్ సాల్వేగా మారాడు. తాజాగా ఈనెల 16న బంధువుల సమక్షంలో లలిత్ సాల్వే మనసు పడిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఈసంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకున్నది..అయితే ఇలా ఆపరేషన్ చేయించుకుని వివాహం చేసుకుంటాను అంటే ఆ అమ్మాయి కూడా ఇష్టపడిందట, దీంతో వారికి ఒకరు అంటే ఒకరు ఇష్టం ఉండటంతో, వారి తల్లిదండ్రులు కూడా పెళ్లి చేశారు, ఇక ఉద్యోగంలో కూడా త్వరలో చేరనున్నాడు లలిత్ సాల్వే…
ఈ క్రింది వీడియో చుడండి