దారుణమైన పరిస్థితిలో దిశా నిందితుల కుటుంబాలు…

127

హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్ సమీపంలో జరిగిన దిశా హత్యాచార సంఘటన ఎంత కలవరం స్పృష్టించిందో మనకు తెలుసు. ఆ ఘటన తర్వాత యావత్తు భారతావని కదిలింది. మళ్ళి ఇలాంటి ఘటన జరగకూడదని, నిందితులకు కఠినంగా శిక్షించాలని అందరు కోరుకున్నారు. ఆ తర్వాత ఎన్ కౌంటర్ జరగడంతో అందరు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన మళ్ళి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఛాయలు ఇంకా అలాగే ఉన్నాయి. ఈ దిశా కేసు ఇప్పటికి కూడా ఇంకా కోర్ట్ లో నడుస్తూనే ఉంది. ఇక ఈ కేసు నిందితుల కుటుంబ పరిస్థితులు అయితే రోజు రోజుకు అద్వానంగా తయారవుతున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

నిందితులలో ఒకరైన చెన్నకేశవులు కుటుంబంలో అతను ఒక్కడే కొడుకు. చేతికి వచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. చెన్నకేశవుల భార్య రేణుక ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆమెకు తొందర్లోనే బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ తండ్రి లేకుండానే పెరగాలి. అలాగే చెన్నకేశవులు తండ్రి కూర్మయ్యకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద ఘటన నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. దీంతో చెన్నకేశవులు కుటుంబానికి ఆధారం లేకుండా పోయిది. అతను చేసిన ఒక్క తప్పు, అతని కుటుంబం నడిరోడ్డు మీద పడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ ఒక్క కుటుంబమే కాదు నలుగురి కుటుంబాల పరిస్థితి కూడా ఇలాగె ఉంది. చనిపోయిన కొడుకులను తల్చుకుని కన్నీళ్లు పెట్టని రోజంటూ లేదు. ముఖ్యంగా జోళ్ళు శివ, మహ్మద్ పాషా కుటుంబాలకు ఆధారం లేకుండా పోయింది. సంపాదించే ఒక్కగానొక్క కొడుకు పోవడంతో, ముసలితనంలో వాళ్ళు ఏం పని చేసుకోలేకపోతున్నారు. దాంతో కుటుంబం గడవడానికి ఇబ్బందిగా మారింది పరిస్థితి. ఇలా క్షణికావేశంలో చేసిన ఒక తప్పుకు నలుగురి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి ఎవరు కూడా ఆడపిల్లకు అన్యాయం చేసి ఆమె ఉసురు పోసుకోకండి. కనీసం ఈ కుటుంబాల కష్టాలు చూసి అయినా కొందరైనా కామాంధులు మారుతారు అని ఆశిద్దాం.

Image result for దిశా నిందితుల కుటుంబాలు

ఇక దిశా ఎన్ కౌంటర్ కేసు ప్రస్తుతం కోర్ట్ లో నడుస్తుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై అనుమానాలను వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వ డైరెక్షన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ అని పలు పిటిషన్లు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణకు సుప్రీం త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య విచారణ కమిషన్ హైదరాబాద్ చేరుకుంది. కమిషన్ సభ్యులైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిర్పూర్కర్, బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి రేఖా శర్మ,మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తీకేయన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయి ఎన్‌కౌంటర్‌పై చర్చించారు. అయితే విచారణ కమిషన్ కోసం అవసరమైన కార్యాలయం,వసతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసిందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.అయితే హైకోర్టులోని సీ-బ్లాక్ వేదికగా కమిషన్ విచారణ సాగించనున్నట్టు సమాచారం. సుప్రీం ఆదేశాల మేరకు కమిషన్‌కు సీఆర్పీఎఫ్ బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation