Breaking News : టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో విషాదం కుప్పకూలిన పవన్ కళ్యాణ్

57

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీర శంకర్ బైరిశెట్టి ఇంట విషాదం నెల‌కొంది, ఆయ‌న తండ్రి అకాల మ‌ర‌ణం చెందారు..దీంతో టాలీవుడ్ లో మ‌రో దారుణ‌మైన వార్త వినాల్సి వ‌చ్చింది…ఒక తెలుగు సినిమా దర్శకుడుగా వీర శంకర్ ఎంతో పేరు సంపాదించారు .గంగావతి , కర్ణాటక వీర శంకర్ జన్మ స్థలం .ఈయన మొదట కోడి రామకృష్ణ దగ్గర సహా దర్శకుడిగా పనిచేసారు ..తరువాత 1997 లో హలో ఐ లవ్ యు సినిమా తో తొలిసారి దర్శకుడు అయ్యారు… 2004 లో పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా తీశారు..

Veera Shankar Father Satya Narayana

వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ ఆయ‌న వ‌య‌సు 83 సంవ‌త్స‌రాలు ఈరోజు ఉదయం వారి స్వగ్రామం చివటం లో మ‌ర‌ణించారు, ఆయ‌న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకు ద‌గ్గ‌ర గ్రామం…విజయ రామరాజు గుడంబా శంకర్ యువరాజ్యం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకులు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ మ‌ర‌ణ వార్త విన్న టాలీవుడ్ న‌టులు ఆయన ఇంటికి చేరుకున్నారు.తండ్రి మ‌ర‌ణంతో ఆయ‌న కోలుకోలేక‌పోయారు.

ఈ క్రింది వీడియోని చూడండి

బైరిశెట్టి సత్యనారాయణ కు ముగ్గురు కుమారులు (వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్) ఉన్నారు. తండ్రి మరణం గురించి శోకతప్త హృదయంతో వీర శంకర్ మాట్లాడుతూ.. మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది.వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం” అన్నారు.. వీరశంకర్ తండ్రి మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయణ్ణి పరామర్శించి సంతాపం తెలిపారు… ప‌లువురు హీరోలు ద‌ర్శ‌కులు ఆయ‌న ఇంటికి చేరుకున్నారు, అలాగే ఆయ‌న‌తో మ‌రికొంద‌రు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation