నా చిన్న కూతురిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నా.. దిశా తండ్రి ఆవేదన..

గతేడాది నవంబర్ నెలలో తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేయడం తెలిసిందే. అయితే ఈ దారుణఖండ జరిగి దాదాపు రెండున్నర నెలలు కావొస్తున్నా ఆ ఘటన దిశ కుటుంబాన్ని ఇంకా పీడకలలలా వెంటాడుతోంది. దిశలేని లోటును తమకు ఎవరు తీర్చలేరని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. నిర్భయ కేసు దోషులకు ఉరి వాయిదాల నేపథ్యంలో దిశా తండ్రి ఒక ప్రముఖ ఛానెల్ కు ఇంటర్యూ ఇచ్చాడు. తమ కూతురికి న్యాయం జరిగినా, ప్రస్తుతం కుటుంబ పరిస్థితి, ప్రభుత్వం సహకారం ఎలా ఉందన్న వివరాలను మీడియాతో దిశ తండ్రి షేర్ చేసుకున్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

తమ కూతుర్ని ఆ నిందితులు పొట్టన పెట్టుకుని నెలలు గడుస్తున్నా.. దిశపై జరిగిన అఘాయిత్యం ఇప్పటికీ తమను పీడకలలా వెంటాడుతుందని ఆమె తండ్రి అన్నారు. ప్రతిరోజూ పెద్ద కూతుర్ని తలుచుకుని దిశ తల్లి ఏడుస్తూనే ఉందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. పెద్ద కూతురికి జరిగిన అన్యాయం కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉందని, చిన్న కూతుర్ని రోజూ తానే స్వయంగా తీసుకెళ్లి డ్రాప్ చేసి, మళ్లీ సాయంత్రం పికప్ చేసుకుని క్షేమంగా ఇంటికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. రెండో కూతురుకి ఆఫీసు క్యాబ్ సౌకర్యం కల్పిస్తున్నా, మరోసారి అవకాశం ఇచ్చే ధైర్యం చేయలేకపోతున్నామని, అందుకే స్వయంగా తానే వెంటవెళ్తున్నట్లు బాధగా చెప్పారు. తన అక్కకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని బాధపడుతుందని, ఆ ఘటన తర్వాత నుంచి కేవలం ఆఫీసుకు తప్ప ఇతరత్రా బయట ప్రదేశాలకు వెళ్లడం మానేసిందన్నారు. తాను కూడా ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ తల్లిదండ్రుల బాధను తాము అర్థం చేసుకోగలమన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తరచుగా కాల్ చేసి మా పరిస్థితిని వాకబు చేస్తున్నారని, ఏదైనా సాయం కావాలంటే ఫోన్ చేయాలని సూచించినట్లు దిశ తండ్రి వెల్లడించారు.

Image result for disha incident father

ఇక దిశా నిందితుల కుటుంబాల పరిస్థితి గురించి మాట్లాడుతూ.. నిందితులు చేసిన పనికి వారి కుటుంబాలు కూడా నడిరోడ్డు మీద పడ్డాయి. వాళ్ళందరూ కూడా చాలా బీద కుటుంబాలు. ఆ నలుగురు చేసిన పనికి వారి కుటుంబాలు శిక్ష అనుభవిస్తున్నాయి. ఏది ఏమైనా తప్పు చేసినందుకు నిందితులకు కఠిన శిక్ష పడింది. ఇది చూసి అయినా ఇంకెవరు ఇలా చెయ్యరని అనుకుంటున్నా. ఇలాంటి దారుణానికి ఒడిగట్టే ముందు ప్రతి మగాడు ఆలోచించుకోవాలి. నేను ఈ తప్పు చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించాలి. ఇక ఎన్ కౌంటర్ కేసు గురించి అడిగితే.. అది కోర్ట్ లో నడుస్తుంది. ఒక ఆడపిల్లకు న్యాయం చేశారు పోలీసులు. కాబట్టి వారిపై కోర్ట్ తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదని దిశా తండ్రి మీడియాకు తెలియజేశారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation