ఘోర రోడ్డు ప్రమాదం : కొండను ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు..

126

ఈ మధ్య మనం ఎక్కువ వింటున్న వార్తలలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ప్రజ్నాపూర్, కరీంనగర్ జిల్లా మానుకొండూరు… ప్రాంతమేదైనా, కారణమేదైనా రహదారులు మాత్రం రక్తాన్ని చిందిస్తున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపటం, రహదారుల రూల్స్ పాటించకపోవటం వంటి పలు కారణాలు రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో అమాయకులు కూడా ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళి అలాంటి ఘోరా రోడ్డు ప్రమాదమే ఒకటి చోటుచేసుకుంది.

This image has an empty alt attribute; its file name is udp2152.jpeg

కర్ణాటకలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉడుపి జిల్లాలో ఓ టూరిస్ట్ బస్సు ప్రమాదవశాత్తు కొండను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది మృతిచెందగా, మరో 27 మంది గాయపడ్డారు. ఎస్కే బోర్డర్ సమీపంలోని మాలా వద్ద మలుపును సరిగ్గా అంచనావేయలేకపోయిన బస్సు డ్రైవర్.. ఎదురుగా ఉన్న గుట్టను ఢీకొట్టాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. మైసూర్‌లోని వైటల్ రికార్డ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సంస్థ ఉద్యోగులు ఉడుపి, హోరండు, కుద్రేముఖ పర్యటనకు డీఆర్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు శనివారం సాయంత్రం మాలా వద్ద ప్రమాదానికి గురైందని ఉడుపి ఎస్పీ విష్ణువర్దన్ తెలిపారు. ప్రమాదకరమైన మలుపు వద్ద వాహనాన్ని అదుపుచేయలేకపోయిన డ్రైవర్ ఎదురుగా ఉన్న కొండను ఢీకొట్టాడని వెల్లడించారు. బస్సు శృంగేరీ నుంచి మాలా మీదుగా ఉడుపికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు.

ఘటనా స్థలిలోనే ఓ మహిళ సహా నలుగురు చనిపోయారని అన్నారు. మిగతా ఐదుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారని, వీరిని టూరిస్ట్ బస్సు‌లో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఉడుపి హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. ప్రమాదంలో వైటల్ రికార్డ్స్ ఉద్యోగులు నలుగురు మృతిచెందినట్టు ధ్రువీకరించారు. మొత్తం 35 మంది ఉద్యోగులు ఈ బస్సులో విహారయాత్రకు వెళ్లినట్టు పేర్కొన్నారు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation