breakingnews : ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కన్నుమూత

ఈ మధ్య వరుసగా ప్రముఖులు చనిపోతున్నారు. అటు సినీ, ఇటు రాజకీయ రంగంలో ప్రముఖులు వివిధ కారణాల వలన కన్నుమూస్తున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్ పాల్ గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు 61 ఇయర్స్. తపస్ పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబైకి వెళ్లగా, కోల్‌కతాకు తిరిగి వచ్చే సమయంలో విమానాశ్రయంలో అతనికి గుండెనొప్పి రావడంతో జుహులోని ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరి 18వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు తపస్ పాల్ మరణించాడు. అతను కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.

ఈ క్రింది వీడియోని చూడండి

సోమవారం తపస్‌ పాల్‌ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవ శాత్తు తపస్‌ పాల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా తపస్‌పాల్‌ పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. కొన్ని రోజులుగా అయన గుండె జబ్బుకు చికిత్స తీసుకుంటున్నారు. కానీ కూతురి కోసం ముంబై వెళ్లగా, అక్కడ విమానాశ్రయంలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. తపస్‌ పాల్‌ పశ్చిమ బెంగాల్‌లోని చందన్‌నగర్‌లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్‌ కాలేజీలో బయోసైన్స్‌ చదివారు. సినిమాల మీద మక్కువతో 1980లో దర్శకుడు తరుణ్‌ మజుందార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్‌ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహువా రాయ్‌చౌదరి, దేబాశ్రీ రాయ్ మరియు సంధ్య రాయ్ లతో కలిసి నటించారు. దేబాశ్రీ రాయ్‌తో, తపస్ పాల్ నిశాంతే, సంప్తి, చోఖేర్ అలోయ్ సహా పలు చిత్రాల్లో నటించారు.

గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత..!

తపస్ పాల్ 1984 లో అబోద్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మాధురి దీక్షిత్ సరసన నటించారు. హిరెన్ నాగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మూడు దశాబ్దాలుగా తన కెరీర్‌లో, తపస్ పాల్ ప్రోసెంజిత్ ఛటర్జీ, సౌమిత్రా ఛటర్జీ, రాఖీతో పాటు మౌసుమి ఛటర్జీతో సహా నటులతో కలిసి పనిచేశారు. తపస్ పాల్ చివరిసారిగా 2013లో ఖిలాడి సినిమాలో కనిపించారు. సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్‌ రాజకీయాల్లో కూడా రాణించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగానూ తపస్ పాల్ పనిచేశారు. డిసెంబర్ 31,2016లో చిట్ ఫండ్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. 13 నెలల జూలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనకు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. ఆయన మృతిపై పలువురు బెంగాలీ నటుడు, తృణమూల్ కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation