మారుతీరావు ఆత్మహత్య… వీలునామా రద్దు చేయించిన తమ్ముడు కార‌ణం ఇదే

165

కూతురుపై ప్రేమ చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌కు దారి తీసింది.వెన‌క్కి వ‌స్తుంది అనుకున్న కూతురు మ‌ళ్లీ కేసు పెట్టింది.
ఇదే మారుతీరావుని తీర‌ని వేద‌న‌కు గురి చేసింది.అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురే ఉరి శిక్ష ప‌డాలి అని కోరుకుంది.
ఇవ‌న్నీ మారుతీ రావుని తీర‌ని వేద‌న‌కు గురి చేశాయి.చివ‌ర‌కు త‌న‌కు తానుగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డేలా చేశాయి.
మారుతీరావు మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, మారుతీరావు చనిపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. అదే సమయంలో ఆయన ఆస్తి గురించిన విషయాలు కూడా తెరపైకి వచ్చాయి. ప్రణయ్ హత్య కేసులో సహ నిందితుడు మారుతీరావు సోదరుడు శ్రవణ్ మీడియా ముందుకొచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. కేసులో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మా అన్నయ్య చనిపోయిన విషయం మా వదిన ఫోన్ చేస్తే తెలిసింది. ఆమెను తీసుకుని హైదరాబాద్ వచ్చాం. నాకు, ఆయనకు మాటల్లేవు. కేసుతో సంబంధం లేకపోయినా నన్ను ఇరికించారు. మూడు నెలల నుంచి మాటల్లేవు. మా మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయనేది నిరాధారం. మా ఆస్తులు మాకున్నాయి. తగాదాలేం లేవు. ఆస్తి కోసం ఒత్తిడి చేశామనడం తప్పు. వంద శాతం ఆస్తి తగాదాలు లేవు. మారుతీరావు ఏం తీసుకెళ్లాడు. నేనేం తీసుకెళ్తాను. అని శ్రవణ్ స్పష్టం చేశారు.

Image result for maruthi rao

2018 మార్చిలోనే మారుతీరావు వీలునామా రాశారని శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రణయ్ హత్యకు ముందే ఈ వీలునామా రాశారన్నారు. దీనిపై తాను అన్నను ప్రశ్నిస్తే ప్రణయ్ కుటుంబం నుంచి ప్రమాదం ఉందనే సమాచారం వల్లే తాను వీలునామా రాసినట్టు మారుతీరావు తనకు చెప్పారని శ్రవణ్ తెలిపారు. సెప్టెంబర్‌లో ప్రణయ్ కేసు అయిన తర్వాత తానే ఒత్తిడి చేసి ఆ వీలునామా రద్దు చేయించానని శ్రవణ్ చెప్పారు. పొరపాటున మారుతీరావుకు ఏదైనా జరిగితే తన వల్లే జరిగిందని అనుమానాలు వస్తాయన్న భయంతో తాను వీలునామాను రద్దు చేయించానని శ్రవణ్ తెలిపారు. రద్దు చేయించిన పేపర్లు కూడా తాను చూడలేదని చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రణయ్‌ను చంపించానన్న పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అమృత చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ తప్పుపట్టారు. అసలు మారుతీరావు ఎందుకు పశ్చాత్తాపపడాలని ప్రశ్నించారు. ఆయన ఏం తప్పు చేశారని నిలదీశారు. మారుతీరావు షెడ్ 10, 12 సంవత్సరాల నుంచి పాడుబడి ఉందన్నారు…. అందులోకి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో కూడా తమకు తెలియదన్నారు. అమృతకు తానేమీ చెప్పబోనన్నారు. తల్లీకూతుళ్లకు మధ్య సయోధ్య ఉంటే అది వారి విషయమన్నారు. గ‌తంలోనే ఈ వీలునామా ర‌ద్దు చేయించాము అని పూర్తి విష‌యాలు వెల్ల‌డించారు మారుతీరావు సోద‌రుడు శ్ర‌వ‌ణ్.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation