ప్రభాస్పై పోలీస్ కేసు.. ఇళ్ళు సీజ్ చేసిన అధికారులు కారణం తెలిస్తే షాక్..!

103

హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌస్కి సంబంధించి రెవెన్యూ పరంగా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రభాస్, ఆయన అనుచరులు నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ రెవెన్యూ శాఖ అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి


ఈ ాయదుర్గంలోని సర్వే నెంబర్ 46 లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇదే సర్వే నెంబర్లో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్ హౌస్ నిర్మించారు. జీవో నెంబర్ 59 కింద దీనిని రెగ్యూలరైజ్ కూడా చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు ప్రభాస్.

అయితే ఇది ప్రభుత్వ భూమి అని, గతంలోనే గుర్తించిన శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది దానిని సీజ్ చేశారు. అయితే లాక్డౌన్ సమయంలో తన గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు ప్రభాస్ వ్యక్తిగత సిబ్బంది యత్నించారని పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.


కేసుకు సంబంధించి కూకట్ పల్లి కోర్టులో ట్రయల్ జరగనుంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణం, సీజ్ చేసిన ఈ గెస్ట్ హౌస్ లోకి ప్రవేశించడంపై విచారణ తదితర అంశాలపై కోర్టులో ట్రయల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఇష్యూపై ప్రభాస్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆయనకు సంబంధించిన లాయర్లు ఈ కేసును నడిపిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసులో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు
వస్తాయో!.

Content above bottom navigation