తెలంగాణలో అక్కడ సంపూర్ణ లాక్ డౌన్.. ప్రజలు సంచలన నిర్ణయం

36

పట్టణంలో వైరస్‌ వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా కట్టడి చేసేందుకు పట్టణ వాసులంతా బంద్‌ పాటిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే పట్టణంలో అన్ని వ్యాపార, వాణిజ్య దుకాణాలన్నిటినీ మూసివేశారు.

అత్యవసర సేవల కింద క్లినిక్‌లు, హాస్పిటళ్లు, మెడికల్‌ షాపులు, వ్యవసాయానికి సంబంధించి ఎరువుల దుకాణాలు మాత్రం తెరిచారు.ఇక మున్సిపాలిటీలోని ప్రజలంతా ఎవరికి వారు తమ ఇళ్లలోనే ఉండిపోయారు.

దీంతో మాడుగుల-దేవరకొండ, ఆమనగల్లు-హైదరాబాద్‌-శ్రీశైలం, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు-షాద్‌నగర్‌ తదితర అన్ని రహదాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా తమకు తాముగా పెట్టుకున్న ఈ లాక్ డౌన్‌కు పట్టణవాసులు సహకరిస్తుండడం విశేషం.

వివిధ మండలాలకు సంబంధించిన గ్రామాలు, పట్టణాల్లోనూ ఇందుకు మద్దతు పలికారు. ఈ లాక్ డౌన్ ఈ నెల 17 వరకు ఉంటుందని తెలుస్తోంది.

Content above bottom navigation