అమెరికాలో ఒక్క‌రోజే ప‌దివేల కరోనా కేసులు

176

చైనా, ఇటలీ తర్వాత కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే. ఇప్పుడక్కడ 54000 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులున్నారు. మృతుల సంఖ్య 775 అయితే, ఒక్క రోజు వ్యవధిలో 150 మరణాలు చోటుచేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై నిప్పులు కురిపించారు. నిన్న ఒక్క‌రోజు 10 వేల కేసులు న‌మోదు అయ్యాయి.

కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

సకాలంలో చైనా తమతో సమాచారం పంచుకోని కారణంగానే ఈ మహమ్మారి విజృంభిస్తోందని ఆరోపించారు. మొదట్లోనే చైనా ఈ వైరస్ గురించి తమకు సమాచారం అందించి ఉంటే బాగుండేదని, చైనా వైఖరి తమకు అసంతృప్తిని కలిగించిందని అన్నారు. కానీ తాను చైనాలా ఎప్పటికీ వ్యవహరించనని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారు.

Content above bottom navigation