ప్రేమా? పగా ? మారుతీరావు విషాద కుటుంబ కథా చిత్రం..

29

మారుతీరావు.. ఇప్పుడు తెలుగురాష్టాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి. కూతురిపై ఉన్న ప్రేమ వల్లనో లేక, కేసుల నుంచి తప్పించుకోలేనని అనుకున్నాడేమో కానీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దాంతో తల్లిదండ్రులందరి దృష్టిలో హీరో అయ్యాడు. కూతురిని విలన్ చేశాడు. అయితే మారుతీరావుది ప్రేమనా..లేక పగనా? ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కానీ విషయం. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే…

Image result for maruti rao
బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

మారుతిరావుది పగనా? లేక ప్రేమనా అనేది తెలియాలంటే ముందు మనం గతంలోకి వెళ్ళాలి. మారుతీరావు కూతురు తానూ స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే తన క్లాస్ మెట్ అయినా ప్రణయ్ అనే కుర్రాడిని ప్రేమించింది. అతనిపై అంతులేని ప్రేమను పెంచుకుంది. ఆ ప్రేమనే కోట్ల ఆస్తిని వదులుకునేలా చేసింది. 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రులను కాదనుకుని ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇది మారుతీరావు తన జీవితంలో ఎదుర్కొన్న మొదటి అవమానం. తన కూతురు ఎవరితోనో వెళ్ళిపోయింది అని నలుగురు అంటే విని తట్టుకోలేకపోయాడు. ఇలా పెళ్లి చేసుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అమృత ప్రణయ్ చేసిన తప్పు ఏంటంటే..ఊరి నుంచి వెళ్ళిపోయినా మూడు నెలల తర్వాత సొంత ఊరికి వచ్చి కన్నతండ్రి ముందే కాపురం పెట్టారు. ఇది మారుతీరాని ఇంకా కృంగదీసింది. తన కళ్ళ ముందే తన కూతురు, తనకు ఇష్టం లేని వ్యక్తితో, వేరే కులం వాడితో ఉండటం ఆ తండ్రి చూడలేకపోయాడు. అందుకే ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురు తన దగ్గరకు రావాలంటే ఆమె భర్త ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే కొంతమంది రౌడీ షీటర్లకు కోటి రూపాయల సుపారీ ఇచ్చి కూతురు ముందే ఆమె భర్తను అతి దారుణంగా చంపించాడు. ఇది మారుతీరావు జీవితంలో తీసుకున్న సంచలన నిర్ణయం. కానీ ఈ నిర్ణయం ఆయన కూతురి జీవితాన్నే కాదు అయన జీవితాన్ని కూడా ననాశనం చేస్తుందని భావించలేదు. అలా ఆలోచించి ఉంటె ఈ నిర్ణయానికి వచ్చేవాడు కాదు. అమృత కేసు పెట్టడంతో అందరు కూడా వెళ్లి జైలులో చిప్పకూడు తిన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

జైలులో 7 నెలలు గడిపిన తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఘటన జరిగి 7 నెలలు అవుతుంది కదా..తన మీద తన కూతురికి కోపం తగ్గి ఉంటుందేమో అని భావించి మధ్యవర్తులతో తన కూతురికి రాయబారం పంపించాడు. తన దగ్గరకు వస్తే తన యావదాస్తిని కూడా తన మీద రాస్తా అని చెప్పాడు. కానీ తండ్రి మాటలను ఆ కూతురు పట్టించుకోలేదు. తనకు ఆస్తే ముఖ్యం అనుకుంటే ప్రణయ్ ను ప్రేమించేది కాదు, తనకు డబ్బే ముఖ్యం అయితే అన్నిటిని వదిలి ప్రణయ్ వెంట వెళ్ళేది కాదు. తన దృష్టిలో డబ్బు అనేది బతకడం కోసం కావాలి కానీ డబ్బే ముఖ్యం అనుకోలేదు. అందుకే తండ్రి పంపిన రాయబారాన్ని వెనక్కి పంపింది. అంతేకాదు తన తండ్రి తనను వేధిస్తున్నాడని మరొక కేసు పెట్టింది. ఇది మారుతీరావు ఎదుర్కొన్న మరొక ఎదురుదెబ్బ. తాను ఇంత ఆస్తి సంపాదించింది తన కోసమే కదా.. ఆమె భర్త దూరం అయితే న దగ్గరకు వస్తుందనే కదా ఆమె భర్తను చంపించాను. తన దగ్గరకు తన కూతురు ఎందుకు రావడం లేదని తనలో తానూ కుమిలిపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ కూతురు తన వద్దకు రాలేదు. ఈ బాధ ఇలా ఉంటె ఇంకొన్ని రోజుల్లో ప్రణయ్ హత్య కేసు విచారణకు రానుంది. తప్పు అతనే చేశాడని నిర్దారణ అయ్యింది కాబట్టి శిక్ష పడటం ఖాయం. సమాజంలో కాపాడుకుంటూ వచ్చిన పరువు మొత్తం పోయింది. ఇలా ఎన్నో విషయాలు మారుతీరావు మదిలో మెదిలాయి. అందుకే మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోతే అయినా తన మీద కూతురికి కోపం తగ్గుతుందేమో అని అనుకున్నాడు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మారుతీరావు చేసిన మరొక పెద్ద తప్పు.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Image result for మారుతీరావు
కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న స్టార్ బ్యూటీ వాణి కపూర్

ఒక్కసారి మారుతీరావు మొదటినుంచి చేసిన పనులు చుస్తే ఆయనలో ప్రేమ కనపడుతుంది. పగ కనపడుతుంది. కూతురు అంటే ఎంతో ప్రేమ. ఆమె కోసం అతను చెయ్యని పని లేదు. కానీ అదే సమయంలో వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపం ఉంది. ఆ కోపం కాస్త అల్లుడిపై పగకు దారితీసింది. అందుకే అల్లుడ్ని చంపించాడు. కానీ కూతురిపై మాత్రం చిన్న గాయం అవ్వనివ్వలేదు. ఇక్కడే మారుతిరావులో పగ కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె కోసం ఎంతాగానమో ప్రయత్నించాడు. చివరికి సూసైడ్ లెటర్ కు కూడా అమృత అమ్మ దగ్గరకు వేళ్ళు అని రాశాడు. దీనిని బట్టి చుస్తే మారుతిరావుకి అమృత మీద ఇంకా ప్రేమ ఉందని అర్థం అవుతుంది. ఇలా మారుతీరావు ప్రేమ పగల మధ్య నలిగిపోయి ఇప్పుడు విగతజీవిలా మారిపోయాడు. మారుతీరావు చేసిన రెండు తప్పుల విషయానికి వస్తే.. మొదటిది అల్లుడిని చంపించడం. రెండు అతను చావడం. మొదటి తప్పు వలన అతని కూతురు విధవ అయితే, రెండవ తప్పు వలన అతని భార్య విధవ అయ్యింది. అతను చేసిన తప్పుకు రెండు జీవితాలు నాశనం అయ్యాయి. ఏది ఏమైనా మారుతీరావు కథ మాత్రం విషాదంగా మారిపోయింది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation